Nose Tips : ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉంటే ఈ వ్యాధి గ్యారంటీ ముక్కు లోపల వేళ్లు పెట్టుకుంటే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అటవాటు మెదడులో బీటా అమిలాయిడ్‌ను ఉత్పత్తి చేసి అల్జీమర్స్ వంటి న్యూరో-ఇన్‌ఫ్లమేటరీ సమస్యలను కలిగిస్తుందని అంటున్నారు. ముక్కును శుభ్రంగా ఉంచుకుంటే అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 12 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Nose Tips : ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది అల్జీమర్స్(Alzheimer's) వ్యాధితో బాధపడుతున్నారు. కొందరికి ముక్కు లోపల వేలు పెట్టి తిప్పడం అలవాటు. ఈ అలవాటు కారణంగా చుట్ టుపక్కల వారు మిమ్మల్ని అసహ్యించుకోవడమే కాకుండా మీపై చెడు అభిప్రాయంతో ఉంటారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం.. ముక్కులో వేలు పెట్టుకోవడంతో అల్జీమర్స్ వ్యాధి వస్తుందని తేలింది. ముక్కులో వేలు పెట్టుకోవడంపై కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కు-అల్జీమర్స్: బీటా అమిలాయిడ్ అనే ప్రోటీన్ అల్జీమర్స్ పురోగతిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ముక్కు(Nose) లో వేళ్లు పెట్టుకోవడం ద్వారా వ్యాధికారకాలు మెదడులో బీటా అమిలాయిడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది అల్జీమర్స్ వంటి న్యూరో-ఇన్‌ఫ్లమేటరీ సమస్యలను కలిగిస్తుంది. మెదడులోకి బ్యాక్టీరియా చేరుతుంది: వ్యాధి కారక సూక్ష్మజీవులు ముక్కు ద్వారా మెదడుకు సులభంగా చేరుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాధికారక, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాసికా కణాలకు నిరంతరం సోకుతుంది. ఇది చివరికి మెదడుకు చేరుతుంది. అల్జీమర్స్ సమస్య రాకుండా ముక్కును శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. అల్జీమర్స్‌ను నివారించడానికి కొన్ని మార్గాలు: మన అలవాట్ల వల్ల కూడా అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. ముక్కులో వేళ్లు పెట్టుకోవడం అస్సలు చేయకూడదు. ముక్కును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలుకలపై అధ్యయనం: ఎలుకల(Rats) పై నిర్వహించిన అధ్యయనంలో వ్యాధికారక బ్యాక్టీరియా ముక్కు ద్వారా మెదడు(Brain) లోకి ఎలా ప్రవేశిస్తుందో తేలింది. ఇలాంటి అధ్యయనాలు మానవులలో కూడా చేస్తున్నారు. పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి: అల్జీమర్స్ లాంటి పెద్ద సమస్య రాకుండా ఉండాలంటే చిన్న చిన్న అలవాట్లను వదులుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. ముక్కు లోపల వేళ్లు పెట్టుకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ముక్కును శుభ్రంగా ఉంచుకుంటే అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: తుమ్మినప్పుడు మూత్రం రావడానికి కారణమేంటో తెలుసా? గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగితే మంచిదా? #health-tips #finger #nose #alzheimer-disease మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి