Gyanvapi : జ్ఞాన‌వాపి మసీదు కేసు.. సంచలన తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు!

జ్ఞాన‌వాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హిందువులు పూజలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ సభ్యుడు అంజుమాన్ ఇంతేజామియా వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.

New Update
Gyanvapi : జ్ఞాన‌వాపి మసీదు కేసు.. సంచలన తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు!

Varanasi : జ్ఞాన‌వాపి మసీదు(Gyanvapi Masjid) కేసులో అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) సంచలన తీర్పు వెల్లడించింది. మసీదులో హిందువుల పూజకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు(Varanasi District Court) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ సభ్యుడు అంజుమాన్ ఇంతేజామియా పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం హిందువులు పూజలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది.

సెల్లార్‌లో హిందువుల పూజలు..
ఉత్త‌ర‌ప్ర‌దేశ్(Uttar Pradesh) రాష్ట్రం వార‌ణాసిలో ఉన్న పురాతన కట్టడంపై మతపరమైన వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల మసీదు సెల్లార్‌లో హిందువుల ప్రార్థనలకు అనుమతించాలంటూ వారణాసి జిల్లా కోర్టు జనవరి 31న తీర్పునిచ్చింది. అంతేకాదు టెంపుల్ ట్రస్ట్ నామినేట్ చేసిన పూజారి వాది శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్, శ్రీ కాశీ విశ్వనాథ్ విగ్రహాల పూజలకు ఏడు రోజుల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ కొన్ని గంటల్లోనే అంజుమాన్ ఇంతేజామియా  నేతృత్వంలో మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది.

ఇది కూడా చదవండి : Telangana : రైతుబీమా నిధుల్లో గోల్ మాల్.. భారీగా నొక్కేస్తున్న ‘ఏఈవో’లు!

అయితే దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాస్థానం.. హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. పూజలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఈ ఇష్యూను మరోసారి లేవనెత్తాల్సిన అవసరం కూడా లేదంటూ వ్యాఖ్యానించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు