AP: లేడీ కిల్లర్స్.. అప్పు తీసుకుంటారు, అడిగితే చంపేస్తారు..!

గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఓ మహిళ అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు మహిళలు అప్పు తీసుకొని.. మళ్లీ అడిగితే కూల్‌డ్రింక్‌లో సైనైడ్ కలిపి చంపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 4 హత్యలు, 3 హత్యాయత్నాలు చేసిన లేడీ కిల్లర్స్ ను అరెస్టు చేశారు.

New Update
AP: లేడీ కిల్లర్స్.. అప్పు తీసుకుంటారు, అడిగితే చంపేస్తారు..!

Guntur: గుంటూరు జిల్లాలో మహిళా సైనైడ్ కిల్లర్స్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వడ్లమూడిలో నాగూర్‌ బీని అనే మహిళ జూన్ నెలలో అనుమానాస్పదంగా మృతి చెందగా పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే, కేసు విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. ముగ్గురు లేడీ కిలర్స్ అప్పు తీసుకుని, అడిగితే చంపేస్తారని దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి.

Also Read: ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయకండి.. వైసీపీకి పురంధేశ్వరి వార్నింగ్..!

నాగూర్‌ బీని నుంచి అప్పు తీసుకున్న ముగ్గురు కిలాడీ లేడీలు ఆమె అప్పు అడిగినందుకు బ్రీజర్‌లో సైనెడ్ కలిపి చంపేసినట్లు గుర్తించారు. ఇలా మరో నాలుగు హత్యలు చేసినట్లు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు మునగప్ప రజని, ముడియాల వెంకటేశ్వరి, గొంతు రమణమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: నేను చనిపోతున్నా.. పెళ్లయిన 20 రోజులకే చేతిపై రాసుకొని..!

గతంలో కంబోడియా వెళ్లొచ్చిన ప్రధాన నిందితురాలు వెంకటేశ్వరి అక్కడ పలు నేరాల్లో పాల్గొన్నట్టుగా అధికారులు గుర్తించారు.
నిందితుల్లో మరొకరు వాలంటీర్‌గా పనిచేశారు. ముగ్గురు నిందితులు రెండేళ్లలో 4 హత్యలు, 3 హత్యాయత్నాలు చేశారని అది కూడా ఆ హత్యలను ఒకే స్టైల్‌లో చేసినట్లు తెలుస్తుంది. ఈ గ్యాంగ్‌కి సైనైడ్ అమ్మిన వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: కియా ప్లాంట్ నుంచి 900 ఇంజిన్లు దొంగతనం

ఆంధ్రప్రదేశ్ లో శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని ఉన్న కియా పరిశ్రమ నుంచి కార్ల ఇంజిన్లు మాయం అయ్యాయి. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 900 కనిపించకుండా పోయాయి. దీనికి సంబంధించి కియా యాజమాన్యం కిందటి నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

New Update
ap

KIA Industry

కియా ప్లాంట్ లో ఇంజిన్లు పోయాయి. నమ్మశక్యంగా లేకపోయినా..ఇది నిజంగా జరిగింది. అది కూడా ఆంధ్రాలో ఉన్న కియా పరిశ్రమలో. అది కూడా ఏదో ఒకటి , రెండో పోతే పర్వాలేదులే అనుకోవచ్చును. కానీ ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం అయ్యాయి. దీనికి సంబంధించి కియా ప్లాట్ ఓనర్లు మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దొంగతనం విషయంలో కియా యాజమాన్యం ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరారు. కానీ దీనికి పోలీసులు నిరాకరించడంతో కంప్లైంట్ ఫైల్ చేశారు.  విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు నియమించారు.

ఎక్కడ మాయం అయ్యాయో..

అయితే ఈ కార్ల ఇంజిన్లు ఎక్కడ పోయాయి అన్నది మాత్రం తెలియడం లేదు. ఆంధ్రాలో ఉన్న ప్లాంట్లో కార్లు తయారవుతాయి కానీ విడి భాగాలు అన్నీ ఒక్కో చోట నుంచీ వస్తాయి. కార్ల ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తాయి. ఇప్పుడు మాయం అయిన ఇంజిన్లు తమిళనాడు నుంచి రవాణా అవుతున్నప్పుడు పోయాయా లేక పరిశ్రమలోనే చోరీ అయ్యాయా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి విచారణ పూర్తి చేశారని...త్వరలోనే మీడియా సమావేశం పెట్టి వివరాలు తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. 

 

 today-latest-news-in-telugu | kia | cars | andhra-pradesh 

 

Also Read: Stock Market: నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..

 

Advertisment
Advertisment
Advertisment