Guntur: ఆటోడ్రైవర్ వైఫ్ పీహెచ్‌డీ..స్టోరీ

అతనో సాధారణ ఆటోడ్రైవర్...రోజంతా కష్టపడితే కుటుంబం జరగడం కూడా కష్టమే... అయితే చదువుకోవాలన్న భార్య కోరిక తీర్చాలని భావించాడు..భర్త కష్టాన్ని దగ్గరుండి చూసిన ఆ భార్య చివరకు డాక్టరేట్ సాధించి తన కుటుంబం గర్వపడేలా చేసింది.

New Update
Guntur: ఆటోడ్రైవర్ వైఫ్ పీహెచ్‌డీ..స్టోరీ

ఆదర్శంగా నిలిచిన భర్త

అతనో సాధారణ ఆటోడ్రైవర్...రోజంతా కష్టపడితే కుటుంబం జరగడం కూడా కష్టమే... అయితే చదువుకోవాలన్న భార్య కోరిక తీర్చాలని భావించాడు..భర్త కష్టాన్ని దగ్గరుండి చూసిన ఆ భార్య చివరకు డాక్టరేట్ సాధించి తన కుటుంబం గర్వపడేలా చేసింది.

భర్త సపోర్ట్‌తో పీహెచ్‌డీ పూర్తి

ఇక్కడ వంట చేస్తూ కనిపిస్తున్న ఈమె పేరు షీలా. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం పెదరావూరు. చిన్నతనంలోనే తల్లి మృతిచెందింది. ఊర్లోనే టెన్త్ వరకూ చదివింది. తెనాలిలో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ జాయిన్ అయ్యింది. 2003లో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నప్పుడే ఆటోడ్రైవర్ కరుణాకర్‌తో పెళ్లయ్యింది. పెళ్లైనా కూడా చదువుకోవాలని ఉందంటూ భర్తకు చెప్పింది. దీంతో భార్య చదువుకునేందుకు భర్త కరుణాకర్ ప్రోత్సహించాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఆర్దిక ఇబ్బందులు రావడంతో చదువు మానేసింది. తర్వాత ప్రేరక్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలవాలని భావించింది.

ఎన్ని కష్టాలు ఎదురైనా..

ప్రేరక్‌గా పనిచేస్తూ అందరూ చదువుకోవడం చూసి మళ్లీ చదువుకోవాలన్న కోరిక షీలాలో మొదలయ్యింది. దీంతో ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. భార్య కోరిక కాదనలేని భర్త చదువుకోవడానికి ఒప్పుకున్నాడు. దీంతో డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత పీజీ కూడా ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యింది. లెక్చరర్‌గా చెయ్యాలని షీలా భావించినా పీహెచ్‌డీ ఉంటేనే లెక్చరర్‌గా అవకాశం వస్తుందని చెప్పడంతో పీహెచ్‌డీ చేసేందుకు సిద్దమయ్యింది. భార్యను చదివించేందుకు ఎన్నో అర్ధిక ఇబ్బందులు ఎదురైనా భర్త కరుణాకర్ మాత్రం వెనకడుగు వెయ్యలేదు. మధ్యలో కొన్నిసార్లు ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనప్పుడు భార్యను చదువు ఆపెయ్యాలని చెబుదామని అనిపించినా పట్టుదలతో భార్యకు సహకారం అందించాడు. చదువుకోవాలన్న భార్య కోరిక తీర్చాలని ఎన్ని కష్టాలు ఎదురైనా చదివించానని..ఇప్పుడు పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ సాధించడం గర్వంగా ఉందంటున్నాడు.

సాయం అందించడమే తన లక్ష్యం 

చదువుకోవాలన్న తన లక్ష్యానికి భర్త ప్రోత్సాహం ఎంతగానో ఉపయోగపడిందంటున్నారు డాక్టరేట్ సాధించిన షీలా. డిగ్రీ ఫస్టియర్‌లో ఉన్నప్పుడు పెళ్లి జరిగినా డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో చదువుకు పుల్ స్టాప్ పడిందంటున్నారు. తిరిగి మళ్లీ చదువుకోవాలన్న కోరికను భర్త కరుణాకర్‌కు చెబితే మరో మాట మాట్లాడకుండా అంగీకరించారని చెబుతుంది. పీహెచ్‌డీ పూర్తయ్యిందని..ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలబడడమే కాకుండా తనలాగా చదువుకోవాలనుకునే గృహిణులకు సాయం అందించడమే తన లక్ష్యమంటుంది.

#guntur #autodriver-wife-phd #sheila
Advertisment
Advertisment
తాజా కథనాలు