విశాఖలో ఇన్ఫోసిస్..ఎప్పుడు స్టార్ట్ చేయనున్నారంటే..!! విశాఖలో ఇన్ఫోసిస్ ను సందర్శించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇన్ఫోసిస్ ప్రతినిధులు, జిల్లా అధికారుల చొరవతో విశాఖలో ఇన్ఫోసిస్ సిద్ధమైందని తెలిపారు. ఈ నెల 16 న సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు ఇన్ఫోసిస్ సీఈవో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ఇన్ఫోసిస్ రాకతో మిగిలిన కంపెనీలు కూడా విశాఖ వైపు చూస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దాదాపు1000 మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ ను స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. By Jyoshna Sappogula 12 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Gudivada Amarnath: విశాఖలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పర్యటించారు. ఈ నెల 16 న ప్రముఖ ఐటి దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సెంటర్ ను సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు ఇన్ఫోసిస్ సీఈవో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖలోని ఇన్ఫోసిస్ సెంటర్ ను సందర్శించారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ..ఇన్ఫోసిస్ ప్రతినిధులు, జిల్లా అధికారుల చొరవతో విశాఖలో ఇన్ఫోసిస్ సిద్ధమైందని తెలిపారు. విశాఖలో ఇన్ఫోసిస్ రాక ఏపీలో ఐటి అభివృద్ధికి కీలకం కానుందని ప్కేరొన్నారు. దాదాపు1000 మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ ను స్టార్ చేయనున్నట్లు తెలిపారు. ఇన్ఫోసిస్ రాకతో మిగిలిన కంపెనీలు కూడా విశాఖ వైపు చూస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ తరహాలో విశాఖలో ఐటి అభివృద్ధి చేయాలని దివంగత నేత వైయస్సార్ రుషికొండ హిల్స్ అభివృద్ధి చేశారని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అయితే, విభజన అనంతరం విశాఖలో ఐటి నిర్లక్ష్యానికి గురైందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పెద్ద ఐటి కంపెనీ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం ఇన్ఫోసిస్ విషయంలో చొరవ చూపిందని వెల్లడించారు. సెప్టెంబర్ నెలలోనే సేవలు ప్రారంభించడానికి ఇన్ఫోసిస్ ముందుకు వచ్చిందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఇన్ఫోసిస్ ప్రతినిధులు, జిల్లా అధికారుల చొరవతో ఇన్ఫోసిస్ విశాఖలో సిద్ధమైందని వ్యాఖ్యనించారు. విశాఖలో ఇన్ఫోసిస్ రాక ఏపీలో ఐటి అభివృద్ధికి కీలకం కానుందని వ్యాఖ్యనించారు. దాదాపు1000 మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ ను స్టార్ట్ చేయనున్నట్ల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. Also Read: ఏపీలోని నిరుద్యోగులకు మంత్రి బొత్స శుభవార్త.. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడంటే? #vishaka #infosys #gudiwada-amarnath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి