TSPSC: నాంపల్లిలో ఉద్రిక్తత.. గ్రూప్- 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ గ్రూప్-2 పరీక్షలు వాయిదా కోరుతూ.. గురువారం ఓయూ జేఏసీ నాయకులు తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవటంతో కార్యాలయం పక్కన బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. By Vijaya Nimma 10 Aug 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి TSPSC Group 2 Issue: టీఎస్పీఎస్సీ ముట్టడికి ఓయూ జేఏసీ యత్నం నాంపల్లి టీఎస్పీఎస్సీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రూప్- 2 పరీక్షలకు వ్యతిరేకంగా... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆఫీస్ ముట్టడికి ఓయూ జేఏసీ నాయకులు యత్నించారు. జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పరీక్ష రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న జేఏసీ నాయకులకు టీ కాంగ్రెస్ మద్దతు తెలిపింది. Your browser does not support the video tag. ఆగస్టు 29 , 30న జరుగనున్న గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ...హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను గ్రూప్-2 అభ్యర్థులు ముట్టడించారు. అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో... పెద్ద ఎత్తున తరలివచ్చిన అభ్యర్థులు కమిషన్ కార్యాలయం పక్కనే బైఠాయించి ధర్నా నిర్వహించారు. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షకు ఆగష్టు 29, 30 తేదీలను ఖరారు చేసిన విషయం తెలిసిందే.. కానీ ఆగష్టు నెల మొదటి తేదీ నుండి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్షా తేదీలను ప్రకంటించారని అభ్యర్థులు తెలిపారు. ఒకే నెలలో అటు గ్రూప్- 2 ఇటు గురుకుల పరీక్షల నిర్వాహణ వల్ల... అభ్యర్థులు ఏదో ఒక పరీక్షకు మాత్రమే ప్రిపేర్ అవ్వాల్సిన గత్యంతరం ఏర్పడ్డదని ఆందోళన వ్యక్తం చేశారు. దానివల్ల తాము నష్టపోతున్నామని... గ్రూప్-2 పరీక్షలోని మూడవ పేపర్ ఎకానమీలో గతంలోని సిలబస్‌కు అధనంగా 70 శాతం కలిపారని పేర్కొన్నారు. అంతేకాక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ ఘటనతో తాము మూడు నెలలు మానసికంగా చదవలేకపోయమన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్-2 పరీక్షను... మూడు నెలలు వాయిదా వేయాలని కోరారు. మానవతా దృక్పథంతో మా సమస్యను అర్థం చేసుకుని... తగిన వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్-2 సిలబస్, గురుకుల సిలబస్ రెండూ వేరువేరుగా ఉన్నాయని... రెండు పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన తాము ఒకే నెలలో రెండు పరీక్షలను నిర్వహించడం వల్ల ఎదో ఒకే పరీక్షకు ప్రిపేర్ అవ్వాల్సి వస్తున్నదని తెలిపారు. ఈ కారణం వల్ల మాకు అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. Your browser does not support the video tag. ఇక ఈ విషయంపై స్పందించిన టీకాగ్రెస్.. నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా తొమ్మిదేళ్లు నీరోను తలపించిన కేసీఆర్ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఎన్నికల ముందు ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్ధులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్ని పరీక్షపెడుతున్నాడు. గ్రూప్ -2 పరీక్షల వాయిదాకు లక్షలాది మంది చేస్తోన్న డిమాండ్‌పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా తొమ్మిదేళ్లు నీరోను తలపించిన కేసీఆర్… ఎన్నికల ముందు ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్ధులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్ని ‘పరీక్ష’పెడుతున్నాడు. గ్రూప్ -2 పరీక్షల వాయిదాకు లక్షలాది మంది చేస్తోన్న డిమాండ్ పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని… pic.twitter.com/sLhZEYfB8o — Revanth Reddy (@revanth_anumula) August 10, 2023 #hyderabad #telangana-group-2 #tspsc-exams #group-2-exams #3-months-duration #nampally-tspsc #leaders-of-ou-jac #tspsc-group-2-issue #ts-group-2 #tspsc-group-2-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి