Hyderabad News: హైదరాబాద్‌లో రెండు భవనాలు నేలమట్టం.. అసలేమైందంటే..?

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో రెండు భారీ భవనాలను కూల్చివేశారు. మదాపూర్‌లోని రహేజా మైండ్‌స్పేస్‌లో రెండు భారీ భవనాలను అధికారులు కూల్చివేశారు. అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ సహాయంతో రహేజా మైండ్‌స్పేస్‌లోని భవనాలను క్షణాల్లోనే నేలమట్టం చేశారు.

New Update
Hyderabad News: హైదరాబాద్‌లో రెండు భవనాలు నేలమట్టం.. అసలేమైందంటే..?

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ (Hi-Tech City)లో రెండు భారీ భవనాలను కూల్చివేశారు. మైండ్ స్పేస్‌లోని రెండు బ్లాక్స్‌ (Two Huge Buildings)ను కూల్చివేశారు. క్షణాల్లో రెండు భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల కూల్చివేత సమయంలో బిల్డింగ్ ఓనర్స్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పాత భవనలు కావడంతో ఈ రెండు భవనలను కూల్చివేసినట్లు తెలుస్తోంది. మళ్లీ భారీ బిల్డింగ్స్‌ను నిర్మించేందుకు యజమానులు ప్లాన్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ కూల్చివేతకు టీఎస్ఐఐసీ ( TSIIC) నుంచి యజమానులు అనుమతులు (Owners Permissions)  తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో అక్కడే మరింత ఎత్తులో బిల్డింగ్స్ కట్టాలని యజమానులు ప్లాన్ (Plan) చేసినట్టు సమాచారం.

క్షణాల్లోనే నేలమట్టం

అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ సహాయంతో రహేజా మైండ్‌స్పేస్‌లోని నెంబర్‌ 7, 8 భవనాలను క్షణాల్లోనే నేలమట్టం అయింది. ఏడు అంతస్తుల్లో ఉన్న భవనాలు క్షణాల్లోనే ఎడిపిక్ ఇంజినీరింగ్ సంస్థ భవనాల కూల్చివేతను చేపట్టింది. అయితే, రెండు భవనాల స్థానంలో కొద్దికాలం కిందట కొత్త భవనాలను నిర్మించనున్నారు.అంతేకాకుండా పలు సాంకేతిక కారణాలతో భవనాలకు సమస్యలు రావడంతో వాటిని కూల్చివేశారు. ఈ క్రమంలోనే అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ (State-of-the-art technology) సహాయంతో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను వినియోగించారు. పక్కనే ఉన్న భవనాలకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ భవనాలను కూల్చివేశారు.

హైకోర్టు ఆదేశాలతో..

బ్లాస్టింగ్ జరిగే సమయంలో చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ప్రాణహాని జరగకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో కంట్రోల్ బ్లాస్టింగ్‌ సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈరోజు శని, ఆదివారం కావడం వల్ల ఐటీ ఉద్యోగులకు సెలవు ఉంది. దీంతోఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఈరోజు బ్లాస్టింగ్ అయ్యేందుకు చర్యలు తీసుకున్నారు. అత్యంత టెక్నాలజీని ఉపయోగించి ఈ బ్లాస్టింగ్‌ని నిర్వహించారు. ఈ బ్లాస్టింగ్ విషయంలో అత్యంత మెటీరియల్స్ వాడి 6 సెకండ్ల వ్యవధిలోనే టాప్ నుంచి గ్రౌండ్ వరకు కూడా మొత్తం కూలిపోయింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు