Success Story: ఒక్క ఐడియా రైతు జీవితాన్ని మార్చేసింది..50వేలు ఖర్చు చేసి 2.5లక్షల సంపాదించిన ఓ రైతన్న సక్సెస్ స్టోరీ ఇదే.! వ్యవసాయం దండగా కాదు..పండగ అంటున్నారు నేటి యువరైతులు. లక్షలు ఇచ్చే ఉద్యోగాలు వదులుకుని..సొంతూళ్లలో పంటలు పండిస్తూ భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. ఓ యువ రైతు 2 నెలల్లో రూ.2.50 లక్షలు సంపాదించి మోడల్ గా నిలిచాడు. ఆ రైతు సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 20 Apr 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Success Story: వ్యవసాయం చేస్తే పెట్టిన పెట్టుబడి రాక అప్పులపాలవుతున్నామని చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. సొంతూళ్లను వదిలి ఉపాధికోసం పట్నం బాటపడుతున్న రైతులు ఎంతో మంది ఉన్నారు. కానీ నేటి యువత మాత్రం ఉద్యోగాలు వదిలి పల్లెటూళ్ల బాటపడుతున్నారు. లక్షల్లో జీతాలు సంపాదించడంలో వచ్చే ఆనందం కంటే సొంతూరులో వ్యవసాయం చేయడంలోనే ఉంది అసలైన ఆనందం అంటున్నారు. సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలి ఆధునిక పద్దతుల్లో పంటలు పండిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు తక్కువ పెట్టుబడితో భారీ ఆదాయాన్ని అర్జిస్తున్నారు. అలాంటి ఓ యువరైతు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఓ యువ రైతు రెండు నెలల్లో 2.50లక్షలు సంపాదించిన మోడల్ గా నిలిచాడు. ఆ రైతు చేసింది..సీజన్ కు అనుగుణంగా పంటలు పండించడం. జీవితంలో సరైన గురువు దొరికితే మీ జీవితంలో కొత్త మార్పు సాధ్యమవుతుందనడానికి ఈ రైతు నిదర్శనం. రాయ్ బరేలీ జిల్లాకు చెందిన విజయ్ కుమార్ తన పూర్వీకుల పొలంలో సంప్రదాయ పద్దతిలో వ్యవసాయం చేసేవాడు. అయితే ఓ రోజు తన బంధువుల ఫంక్షన్ కు వెళ్లిన విజయ్ కుమార్ కు తన బంధువుఒకరు హార్టికల్చర్ చేయాలని సూచించారు. సీజన్ కు అనుగుణంగా పంటలు పండిస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చని చెప్పాడు. దీంతో విజయ్ కుమార్ వేసవికాలంలో పుచ్చకాయ సాగు చేస్తే మంచి లాభాలను పొందవచ్చని భావించాడు. తనకున్న కొద్దిపాటి పొలంలో పుచ్చకాయ సాగు చేశారు. వేసవి కాలంలో పుచ్చకాయలకు డిమాండ్ ఎక్కువ. 50 నుంచి 60 వేల పెట్టుబడితో సీజన్ ముగిసేసరికి 2.50లక్షలు సంపాదించినట్లు విజయ్ కుమార్ తెలిపారు. తాను పండించే మిగతా పంటల కంటే పుచ్చకాయ సాగుతో మంచి లాభాలు అర్జినట్లు చెప్పారు. తాను పండించే పుచ్చకాయలు రాయ్ బరేలీ, లక్నో మార్కెట్లకు విక్రయానికి పంపుతున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: రూ. 12లక్షల కోట్లు..సర్కార్ సంచలన ప్లాన్..మోదీతో అట్లుంటది మరి.! #success-story #agriculture #watermelon-farming మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి