Health Drinks: ఆ పానియాలను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తీసేయ్యండి : కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న బోర్న్‌వీటా, ఇతర ఇ-కామర్స్ బ్రాండ్ కంపెనీలు తమ వెబ్సైట్లలో హెల్త్ డ్రింక్స్ కేటగిరీలో ఉన్న పానియాలను తొలగించాలని కేంద్ర వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. By B Aravind 13 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి దేశవ్యాప్తంగా ఉన్న బోర్న్‌వీటా, ఇతర ఇ-కామర్స్ బ్రాండ్ కంపెనీలకు బిగ్ షాక్ తగిలింది. ఈ కంపెనీలకు సంబంధించిన వెబ్‌సైట్లలో 'హెల్తీ డ్రింక్స్' కెటగిరీలో ఉన్న పానియాలన్నింటినీ తొలగించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇటీవల నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(NCPR).. ఇ-కామర్స్ కంపెనీలకు సంబంధించిన పానియాలపై విచారణ జరిపింది. అయితే ఎఫ్‌ఎస్ఎస్ (FSS) చట్టం 2006 ప్రకారం.. ఈ కంపెనీలలో ఉన్న ఏ పానియం కూడా హెల్త్ డ్రింక్ కాదని తేలింది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణజ్య, పరిశ్రమల శాఖ ఏప్రిల్ 10న ఈ కామర్స్ కంపెనీలకు.. తమ వెబ్సైట్లలో హెల్త్ డ్రింక్స్ కేటగిరీలో ఉన్న పానియాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. Also Read: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఏళ్లనాటి శత్రుత్వం.. ఇప్పుడేం జరగనుంది? కొన్నిరోజుల క్రితమే.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇ-కామర్స్ కంపెనీ వెబ్‌సైట్లకు కీలక సూచనలు చేసింది. తమ వెబ్‌సైట్‌లో ఉన్న 'హెల్త్ డ్రింక్ లేదా ఎనర్జీ డ్రింక్' కెటగిరీలో డైరీ, తృణధాన్యాలు, మాల్ట్ ఆధారిత పానియాలను పెట్టకూడదని చెప్పింది. భారత ఆహార చట్టాల ప్రకారం హల్త్ డ్రింక్ అనే పదానికే నిర్వచనం లేదని వెల్లడించింది. ఎనర్జీ డ్రింక్స్ అనేవి కేవలం నీటి ఆధారిత పానియాలని పేర్కొంది. తమ వ్యాపారం కోసం అమ్మే పానీయాలకు ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం వినియోగదారులను తప్పుదోవ పట్టించినట్లే అవుతుందని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రకటనలు తమ వెబ్‌సైట్స్ నుంచి తీసివేయాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) కోరింది. ఇదిలాఉండగా గత నెలలో.. ఎన్‌సీపీసీఆర్ (NCPCR) చీఫ్ ప్రియాంక కనూంగో.. వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI), అలాగే వివిధ రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న వినియోగదారుల వ్యవహారాల విభాగాలకు లేఖ రాశారు. బోర్న్‌వీటాతో సహా.. మిగతా ఏ పానియాలు కూడా హెల్త్ డ్రింక్ అనే పేరుతో అమ్మకాలు జరపడకూడదని పేర్కొన్నట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ చర్యలకు దిగింది. Also Read: నన్ను బెదిరిస్తున్నారు…తీహార్ జైలు నుంచి సుకేశ్ చంద్ర మరో లేఖ #telugu-news #health-drinks #energy-drinks #bournvita మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి