డేటా కనెక్షన్ లేకుండానే మొబైల్ లో టీవీ ప్రసారాలు... కొత్త టెక్నాలజీ తెచ్చే యోచనలో కేంద్రం...!

డైరెక్ట్-టు-హోమ్(డీటీహెచ్) తరహాలో డేటా కనెక్షన్ లేకుండా మొబైల్ ఫోన్ లకు టీవీ చానెల్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీని కోసం డీ2ఎం(డైరెక్ట్ టు హోమ్) అనే సాంకేతికతను తీసుకు వచ్చే యోచనలో వున్నట్టు సమాచారం. ఈ మేరకు ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం విషయంలో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

New Update

డీ2ఎం (డైరెక్ట్-టు-మొబైల్)గా పిలవబడే ఈ సాంకేతికత ద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారులను కేబుల్ లేదా డీటీహెచ్ కనెక్షన్ ద్వారా వారి మొబైల్స్ లో టీవీ ప్రసారాలను చూసేందుకు వీలు కల్పించాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఆ సాంకేతికత కోసం డైరెక్టరేట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్(డీఓటీ), సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, ఐఐటీ కాన్పూర్ లు పని చేస్తున్నట్టు తెలిపాయి.

ఈ ప్రతిపాదనను టెలికాం ఆపరేటర్లు వ్యతిరేకించే అవకాశం ఉంది. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే డేటా కనెక్షన్లపై టెలికాం ఆపరేటర్లకు వచ్చే ఆదాయం భారీగా పడిపోతుంది. ముఖ్యంగా టెలికాం ఆపరేటర్ల 5జీ టెలికాం వ్యాపారం మీద దెబ్బపడుతుందని నివేదికలు చెబుతున్నాయి. మొబైల్ వినియోగదారులకు డేటా కనెక్షన్ లేకుండా ప్రసారాలు అందించే విషయంపై ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారి ఒకరు తెలిపారు.

టెలికాం ఆపరేటర్లతో పాటు అన్ని వర్గాలతో సమావేశం అనంతరం ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై వచ్చే వారం కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో డీఓటీ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు, ఐఐటీ ఖరగ్ పూర్ టీమ్, టెలికాం, బ్రాడ్ కాస్టింగ్ రంగానికి చెందిన ప్రముఖలు పాల్గొంటారని తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు