Goutam Gambhir: అతడిని ఎందుకు ఆడించలేదు.. గంభీర్ సీరియస్!

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ రెండో మ్యాచ్ తుది జట్టు కూర్పుపై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తంచేశారు. శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్ మంచి ఫాంలో ఉన్నప్పటికీ వారిని బెంచికే పరిమితం చేయడం సరైన నిర్ణయం కాదని ఓ ఇంటర్వ్యూలో గౌతం గంభీర్, పీయూష్ చావ్లా వ్యాఖ్యానించారు.

New Update
Goutam Gambhir: అతడిని ఎందుకు ఆడించలేదు.. గంభీర్ సీరియస్!

Goutam Gambhir: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ ఫైనల్ టీం కూర్పుపై మాజీ క్రికెటర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. నెక్స్ట్ ఇయర్ జరగబోయే టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో అందరికీ అవకాశమివ్వాలన్న టీం మేనేజ్‌మెంట్ నిర్ణయం ఈ టైంలో సరైందని కాదన్నాడు గౌతం గంభీర్. అత్యుత్తమ ఫాంలో ఉన్న రవి బిష్ణోయ్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచిన గంభీర్, అతడిని పక్కన పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. ఓ చానెల్ ఇంటర్వ్యూలో పీయూశ్ చావ్లాతో కలిసి మాట్లాడిన గంభీర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: షమీకి అర్జున అవార్డు!.. బీసీసీఐ ప్రత్యేక అభ్యర్థన

యాంకర్‌ అడిగిన ఓ ప్రశ్నకు పీయూశ్‌ చావ్లా స్పందిస్తూ అద్భుతమైన ఫాంతో ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లో ఉన్న ఉన్న రవి బిష్ణోయ్ తప్పకుండా ఆడాల్సిందన్నాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్లను నిరుత్సాహానికి గురిచేస్తాయని చావ్లా వ్యాఖ్యానించాడు.

ఇది కూడా చదవండి: విజయ్‎పై బ్యాడ్ కామెంట్స్.. చానలే లేచిపోయిందిగా!

టీం కూర్పుపై గంభీర్ ఇంకాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ను తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటో తనకు అర్థం కాలేదంటూ అసహనం వ్యక్తంచేశాడు. రవి బిష్ణోయ్‌ తుది జట్టులో కచ్చితంగా ఉండాల్సిన ఆటగాడన్నాడు. కీలకమైన బౌలర్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్, టీమ్‌ మేనేజ్‌మెంట్ క్లారిటీ ఇవ్వాల్సిందే అని గంభీర్‌ స్పష్టంచేశాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు