AP Politics: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గొట్టిపాటి సైకిల్ ర్యాలీ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గొట్టిపాటి రవికుమార్ సైకిల్ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. సైకిల్ యాత్ర14వ రోజు బల్లికూరవ మండలంలో సాగింది. బాపట్ల జిల్లా బల్లికూరవ మండలంలోని గొర్రెపాడు గ్రామం నుంచి మండలంలోని సురేపల్లి గ్రామం వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర సాగింది. By Vijaya Nimma 27 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గొట్టిపాటి రవికుమార్ నివాళులర్పించారు. గ్రామ మహిళలు హారతులు ఇచ్చిన తర్వాత సైకిల్ యాత్ర ప్రారంభమైంది. గొర్రెపాడు ఎస్సీ కాలనీ నుంచి ఎస్ఎల్ గుడిపాడు, రామాంజనేయుపురం, బుసవారి పాలెం, ముక్తేశ్వరం, సూరేపల్లి గ్రామాల మీదుగా సైకిల్ యాత్ర కొనసాగింది. గొట్టిపాటి సైకిల్ యాత్రకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. పలు గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దొంగ హామీలతో ఓట్లు అడగడానికి వస్తున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత 14 రోజుల నుంచి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సైకిల్ యాత్ర చేస్తున్నామన్నారు. ప్రభుత్వం బస్సు యాత్ర పేరుతో మళ్లీ దొంగ హామీలతో ఓట్లు అడగడానికి వస్తోందన్నారు. ఈ విషయం ప్రజలు గమనించి వైస్సార్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. రైతులను బెదిరించి సంతకాలు పెట్టించుకుని మోటార్లు బిగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు మోటార్లు బిగించుకొని వ్యవసాయం చేసే అవకాశం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉచిత కరెంట్... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తామని గొట్టిపాటి తెలిపారు. రైతులకు రానున్న టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. ఇది కూడా చదవండి: చలికాలంలో పిల్లలకు వచ్చే జలుబుతో జాగ్రత్త #ap-politics #bapatla-district #gottipati-cycle-rally #day-14-of-cycle-trip మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి