Sheep Distribution Scheme: గొర్రెల పంపిణీ స్కాంలో మరో ఇద్దరు అరెస్ట్ గొర్రెల పంపిణీ స్కాం కేసులో మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసింది ఏసీబీ. రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డా. కృష్ణయ్య, జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప గొర్రెల పంపిణీలో అక్రమాలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. By V.J Reddy 14 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Sheep Distribution Scheme: గొర్రెల స్కాం కేసులో మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసింది ఏసీబీ (ACB). రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డా. కృష్ణయ్య (Krishnaiah), జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప (Anjilappa) గొర్రెల పంపిణీలో అక్రమాలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. లబ్ది దారులకు గొర్రెల పంపిణీ చేయకుండా చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి డబ్బును కాజేసినట్లు ఏసీబీ అధికారులు నిర్దారించారు. ఇటీవల ఇదే కేసులో నలుగురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ALSO READ: ఇవే నాకు చివరి ఎన్నికలు.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు అప్పుడు నలుగురు.. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం యాదవ సోదరుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలు జరిగినట్లు ఇటీవల కాగ్ (CAG Report) ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ కేసును తెలంగాణ ఏసీబీ సీరియస్ గా తీసుకుంది. ఈ స్కాంలో ఉన్న అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల పశుసంవర్ధక శాఖ (Department of Animal Husbandry) లోని నలుగురు అధికారాలు అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఈ శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, డిప్యూటీ డైరెక్టర్ రఘుపతి రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్, అసిస్టెంట్ డైరెక్టర్ఆ దిత్య కేశవ సాయి లను అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల పంపిణీ లో ఈ నలుగురు అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచి రూ.2.10 కోట్లు నొక్కేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీరిని అదులోపు తీసుకొని మిగితా సమాచారాన్ని లాగుతున్నారు. మాజీ మంత్రి హస్తం?.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. గొర్రెల పంపిణి స్కాం కేసులో (Sheep Distribution Scam) ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్ల మాయంపై ఓ మాజీ మంత్రి ఓఎస్డీ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. 2018 నుంచి ఈ పథకాల్లో అవకతవకలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదనే అంశంపై విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందులో ఎవరి ఒత్తిడి ఉంది? ఎవరి పాత్ర ఉంది అనే దానిపై ఎంక్వైరీ చేయాలని అన్నారు. #brs #kcr #cm-revanth-reddy #sheep-distribution-scam #gorrela-pampini-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి