Viswam Teaser : శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ యాక్షన్.. అదిరిపోయిన 'విశ్వం' టీజర్

గోపీచంద్ లేటెస్ట్ మూవీ 'విశ్వం' నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ యాక్షన్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది. టీజర్ లో నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్‌ కామెడీ ఆకట్టుకుంది. అక్టోబర్ 11 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

New Update
Viswam Teaser : శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ యాక్షన్.. అదిరిపోయిన 'విశ్వం' టీజర్

Gopichand's Viswam teaser : యాక్షన్ హీరో గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'విశ్వం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ స్ట్రైక్, వరల్డ్ ఆఫ్ విశ్వం మేకింగ్ వీడియో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ శ్రీను వైట్ల మార్క్ కామెడీ , గోపీచంద్ యాక్షన్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.

తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో హీరోయిన్ చెప్పే సంభాషణలతో టీజర్ స్టార్ట్ అయింది. నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్‌తోపాటు షకలక శంకర్‌, అజయ్ ఘోష్‌ కాంబోలో సాగే కామెడీ ఆకట్టుకుంది. ఇండియా అప్పుల్లో రెండో స్థానంలో ఉండటానికి కారణం మోసం. నేరాల్లో ఐదో స్థానంలో ఉండటానికి కారణం మోసం.. నేనిక్కడుండటానికి కారణం మోసం అంటూ గోపిచంద్ లోని ఫన్ యాంగిల్ ను చూపించారు.

Also Read : సందీప్ కిషన్ మంచి మనసు.. అభిమాని అడగ్గానే డబ్బులు పంపిన హీరో

ఆ తర్వాత టీజర్ అంతా యాక్షన్ తోనే సాగింది. టీజర్ కలో గోపించంద్ లుక్ కూడా కొత్తగా ఉంది. మొత్తంగా టీజర్ చూస్తుంటే 'విశ్వం' తో అటు శ్రీను వైట్ల, ఇటు గోపీచంద్ గట్టి కం బ్యాక్ ఇచ్చేలానే కనిపిస్తున్నారు. కాగా ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11 న రిలీజ్ చేస్తున్నట్లు టీజర్ చివర్లో వెల్లడించారు మేకర్స్.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment