Space Tour : భారతీయ పైలట్ (Indian Pilot) గోపీ తోటకూర (Gopi Thotakura) తొలిసారిగా జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ విమానం (Jeff Bezos Blue Origin Flight) లో అంతరిక్ష యాత్ర ను చేపట్టారు. బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ -25 మిషన్ లో భాగంగా ఆరుగురు సిబ్బందితో అంతరిక్షం అంచు వరకు సబ్‌ఆర్బిటల్ మిషన్‌ను ప్రారంభించింది. ఇందులో గోపీచంద్ తోటకూర ఒకరు.
LAUNCH! Blue Origin New Shepard launches on a suborbital mission to the edge of space with six crew.
Overview: https://t.co/cEpcJaMleF
Official livestream:https://t.co/YBtZZWj32F pic.twitter.com/OkxHvJy4NA
— Chris Bergin - NSF (@NASASpaceflight) May 19, 2024
ఈ యాత్ర వెస్ట్ టెక్సాస్‌లోని లాంచ్ సైట్ వన్ బేస్ నుంచి ప్రారంభించబడగా.. సదరు సంస్థ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. అంతరిక్ష నౌక సముద్ర మట్టానికి 62 మైళ్ళు (100 కిమీ) అంతర్జాతీయంగా గుర్తించబడిన అంతరిక్ష సరిహద్దు అయిన కర్మన్ రేఖను అధిగమించడంతో ప్రయాణీకులు భూమి వక్రతను చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే వారంతా కొన్ని నిమిషాలపాటు వారు ఎంలాంటి బరువులేని అనుభూతిని పొందినట్లు వెల్లడించింది. ఈ మేరకు బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ -25 (NS-25) మిషన్‌కు ఎంపికైన ఆరుగురు సిబ్బందిలో భారత సంతతికి చెందిన వ్యవస్థాపకుడు పైలట్, గోపీచంద్ తోటకూరతోపాటు యునైటెడ్ స్టేట్స్‌లో మొట్టమొదటి నల్లజాతి వ్యోమగామి అభ్యర్థి మాజీ ఎయిర్ ఫోర్స్ కెప్టెన్ ఎడ్ డ్వైట్ కూడా ఉన్నారు.
Also Read : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వారం రోజుల్లో 26 వేల కేసులు