Google Pixel Phones: గూగుల్ పిక్సెల్ 9 విడుదల..ధర, ఫీచర్లు ఇవే..

అందరూ ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెల్9 ఫోన్ ఇండియాలో విడుదల అయింది. మొత్తం నాలుగు మోడల్స్‌లో ఈ ఫోన్లను విడుదల చేసింది గూగుల్. వీటిలో పిక్సెల్‌ 9 , పిక్సెల్‌ 9 ప్రో , పిక్సెల్‌ 9 ప్రో ఎక్స్‌ఎల్‌ , పిక్సెల్‌ 9 ప్రో ఫోల్డ్‌  ఉన్నాయి.

New Update
Google Pixel Phones: గూగుల్ పిక్సెల్ 9 విడుదల..ధర, ఫీచర్లు ఇవే..

Goggle Pixel Phones Released: టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ విడుదల అయింది. గూగుల్ అధికారికంగా వీటిని ఇండియాలో రిలీజ్ చేసింది. మొత్తం నాలుగు మోడల్ ఫోన్లను విడుదల చేసింది గూగుల్.వీటిలో పిక్సెల్‌ 9 (Pixel 9), పిక్సెల్‌ 9 ప్రో(Pixel 9 Pro), పిక్సెల్‌ 9 ప్రో ఎక్స్‌ఎల్‌ (Pixel 9 Pro XL), పిక్సెల్‌ 9 ప్రో ఫోల్డ్‌ (Pixel 9 pro Fold) ఉన్నాయి. వీటిలో టెన్సార్‌ జీ4 ఎస్‌ఓసీ, టైటాన్‌ ఎం2 సెక్యూరిటీ చిప్‌ ఉంటుందని గూగుల్ చెప్పింది. వీటిల్లో ఏడు ఏళ్ళ వరకు సెక్యూరిటీ అప్‌డేట్లను ఇస్తున్నట్లు చెప్పింది. పిక్సెల్‌ 9లో 12 జీబీ ర్యామ్‌ ఉండగా, పిక్సెల్‌ 9 ప్రో, ప్రో ఎక్సెఎల్‌లో 16జీబీ ర్యామ్‌ ఉన్నాయి. ఆగస్టు 22 నుంచి వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

పిక్సెల్‌ 9 ధర, ఫీచర్లు...

పిక్సెల్‌ 9 ఫోన్ ధర 79,999రూ. ఉంది. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజీతో ఇది వస్తుంది. పీయోనీ, ఒబ్సిడియాన్‌, వింటర్‌గ్రీన్‌, పోర్సెలేన్‌ కలర్స్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో డ్యుయల్‌ సిమ్ సౌకర్యం ఉంది ఆండ్రాయిడ్‌ 14 సాఫ్ట్‌వేర్‌తో ఇది పనిచేస్తుంది. 6.3 అంగుళాలతో కూడిన ఈ ఫోన్లు ఆక్చూవా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే తో వస్తున్నాయి. రిఫ్రెష్‌ రేట్‌ రేజింగ్‌ 69హెచ్‌జడ్‌ నుంచి 120 హెచ్‌జడ్‌ వరకు ఉంది. దానికి తోడు కార్నింగ్‌ గోరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 కవర్‌తో కూడిన స్క్రీన్ ను ఈఫోన్‌కు పెట్టారు. ఈ మెబైల్‌లో వైప్‌ డ్యుయల్‌ కెమెరా ఇచ్చారు. 50 మెగాపిక్సెల్‌ ఆక్టా పీడీవైడ్‌ యాంగిల్‌ కెమెరాతో పాటు, 64 మెగా పిక్సెల్‌ క్వాడ్‌ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఉంది. 8X వరకు జూమ్‌ చేయవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా 10.5 మెగాపిక్సెల్‌తో ఉండనుంది. ఆలోఫోకస్‌తో డ్యుయల్‌ పీడీ సెల్ఫీ తీసుకోవచ్చు. వెనకవైపు కెమెరాతో 4కే వీడియోలను తీసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌కు టైప్ సీ ఛార్జర్‌‌ను ఇచ్చారు. ఫోన్‌లో 4,700ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది అయితే ఫోన్‌తో పాటూ ఛార్జర్‌‌ను ఇవ్వడం లేదు. దానిని వేరేగా కొనుక్కోవాలి.

పిక్సెల్‌ 9 ప్రో, పిక్సెల్‌ 9 ప్రో ఎక్స్‌ఎల్‌ ధర, ఫీచర్లు..

పిక్సెల్‌ 9 ప్రో, పిక్సెల్‌ 9 ప్రో ఎక్స్‌ఎల్‌లోనూ పిక్సెల్‌ 9లో ఉన్న ఫీచర్లే ఉన్నాయి. 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజీ గల పిక్సెల్‌ 9 ప్రో ధర 1,09,999రూ. ఉంది. పిక్సెల్‌9 ప్రో ఎక్స్‌ఎల్‌ ధర 1,24,999రూ. గా ఉంది. ఇది 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజీ వస్తోంది. ఈ రెండు మోడల్స్‌ హాజెల్‌, పోర్సెలేన్‌, రోజ్‌ క్వార్ట్జ్‌, ఒబ్సిడియాన్‌ కలర్‌ వేరియంట్‌లలో వస్తున్నాయి. పిక్సెల్‌ 9 ప్రో 6.3 అంగుళాల పొడవు ఉంటే.. పిక్సెల్‌ 9 ప్రో ఎక్స్‌ఎల్‌ కొంచెం లార్జ్‌ సైజ్‌లో 6.8 అంగుళాల పొడవు కలిగి ఉంటుంది.ఈ రెండు మోడల్స్‌లోనూ కార్నింగ్‌ గోరిల్లా గ్లాస్‌ ఉంది. ఈరెండు ఫోనలలోనూ ట్రిపుల్ కెమెరా ఉంది. వీటిలో 50 ఎంపీ ఆక్టా పీడీ వైడ్‌ కెమెరా, 49ఎంపీ క్వాడ్‌ పీడీ అల్ట్రావైడ్‌ కెమెరా, 48 ఎంపీ క్వాడ్‌ పీడీ టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. 30x వరకు జూమ్‌ చేసి ఫొటోలు తీసుకోవచ్చు. ముందు వైపు 42 ఎంపీ కెమెరా ఉంటుంది. ఈ రెండు మోడల్స్‌తో 8కే వీడియో తీయవచ్చు. పిక్సెల్‌ 9తో పోలిస్తే ఈ రెండు మోడల్స్‌లో అదనంగా టెంపరేచర్‌ను అలర్ట్‌ చేసే సెన్సార్‌లను ఇచ్చారు.

పిక్సెల్‌ 9 ప్రో ఫోల్డ్‌ ఫోన్‌ ధర, ఫీచర్లు..

గూగుల్ పిక్సెల్‌9 లో మరో ఫోన్.. ప్రో ఫోల్డ్‌ ఫోన్‌. బుక్‌ స్టైల్‌లో ఫోల్డబుల్‌ గా ఉంటుందీ ఫోన్. దీని ధరను రూ.1.72,999. ఇందులో టెన్సార్‌ జీ4 చిప్‌సెట్‌ను అమర్చారు. గోరిల్లా గ్లాస్‌తో వస్తున్న కవర్‌ స్క్రీన్‌లో ఆక్చువా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇచ్చారు. 6.3 అంగుళాల పొడవుతో 120హెచ్‌జడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ కలిగి ఉంది. ఫోల్డ్‌ తెరిస్తే 8 అంగుళాలతో కూడిన ఫ్లెక్స్‌ అమోలోడ్‌ డిస్‌ప్‌లే ఉంటుంది. ఇందులో కూడా వెనక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 10.5 ఎంపీ అల్ట్రావైడ్‌ సెన్సార్‌, 10.8 ఎంపీ టెలీఫొటో కెమెరాలు ఉన్నాయి. దీంతో 5x వరకు ఆప్టికల్‌ జూమ్‌ చేయవచ్చు. ఇది ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌తో పనిచేస్తుంది. 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజీ ఇచ్చారు. 4,560 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇందులో గూగుల్ ఏఐ జెమినీ కూడా ఉంది.

Also Read:National: స్వదేశీ టెక్నాలజీతో కామికేజ్ ఆత్మాహుతి డ్రోన్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు