Google Money 2024: రూ.15,000 ఇస్తున్న గూగుల్!.. పొందేందుకు ఇలా దరఖాస్తు చేసుకోండి!

గూగుల్ కంపెనీపై ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లకు నమ్మకం ఉంది. అత్యంత విశ్వసనీయమైన కంపెనీల్లో ఇది ఒకటి. మరి ఈ కంపెనీ నుంచి రూ.15,000 ఎలా పొందాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తెలుసుకుందాం.

New Update
Google Money 2024: రూ.15,000 ఇస్తున్న గూగుల్!.. పొందేందుకు ఇలా దరఖాస్తు చేసుకోండి!

మన దేశంలో అవసరమైన వారికి చాలా సంస్థలు లోన్లు ఇస్తున్నాయి. ఈ లిస్టులో గూగుల్ పే కూడా చేరింది. ఇందుకోసం శాచెట్ లోన్ (Sachet Loan) అనే ప్లాన్ తెచ్చింది. దీని ద్వారా చిన్న తరహా వ్యాపారులు.. రూ.15,000 వరకూ లోన్ (రుణం) తీసుకోవచ్చు. ఈ మనీని వ్యాపారులు E PayLater ద్వారా పొందవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

ఈ లోన్ అర్థమేంటి?

ఇవి చిన్న రుణాలు. వీటిని 7 రోజుల నుంచి 12 నెలల్లో చెల్లిస్తారు. వెంటనే రుణం ఇచ్చేందుకు వీలుగా ఇలాంటి లోన్లు ఉంటాయి. ఇవి స్వల్పకాలిక అవసరాలు తీర్చుతాయి. అంతేకాదు.. ఇలాంటి లోన్లు ఇచ్చేందుకు ఎక్కువగా డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదు.గూగుల్ పే వాడే వారికి ఈ లోన్ ఇచ్చేందుకు.. ఈ కంపెనీ.. DMI ఫైనాన్స్‌తో చేతులుకలిపింది. ఇది చిన్న వ్యాపారులకు అనుకూలమైన లోన్. UPI ద్వారా ఈ లోన్ పొందేందుకు గూగుల్ పే కంపెనీ… ICICI బ్యాంకుతో చేతులు కలిపింది. అలాగే గూగుల్ పే ద్వారా పర్సనల్ లోన్లు ఎక్కువ మంది పొందేందుకు ఈ కంపెనీ.. యాక్సిస్ బ్యాంకుతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.

గతేడాది గూగుల్ పే.. UPI ద్వారా.. రూ.167 కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు చేసింది. గూగుల్ పే ఇచ్చిన రుణాలలో సగానికి పైగా.. వ్యక్తులకు ఇచ్చినవే. వారి నెలవారీ జీతం రూ.30వేల కంటే తక్కువ. వీరంతా పట్టణాలు, పల్లెల్లో ఉంటున్నవారే.

గూగుల్ పే ఇచ్చే రుణంపై వడ్డీ రేటు సంవత్సరానికి 14 శాతం నుంచి 36 శాతం వరకూ ఉంటుంది. 18 ఏళ్లు, ఆపై ఉన్నవారికే ఈ లోన్ ఇస్తారు. ఈ లోన్ పొందేందుకు ఎలాంటి ఆదాయమూ అవసరం లేదు. ఐతే.. ప్రాసెసింగ్ ఫీజు 5% + GST ఉంటుంది. ఈ రుణాన్ని తక్కువలో తక్కువ రూ.111 చొప్పున కూడా చెల్లించవచ్చు.

అర్హతలు:

భారతీయ పౌరుడు అయివుండాలి. వయసు 18 ఏళ్లకు పైగా ఉండాలి. ఇదివరకు తీసుకున్న అప్పులేవీ చెల్లించకుండా ఉండకూడదు. మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పాన్ కార్డు ఉండాలి. దరఖాస్తు దారు సిబిల్ స్కోర్ కనీసం 750 ఉండాలి.

దరఖాస్తు విధానం:

ఈ లోన్ పొందేందుకు డిజిటల్ డాక్యుమెంట్లు అవసరం. ముందుగా గూగుల్ పే బిజినెస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత లోన్ సెక్షన్ లోకి వెళ్లాలి. అక్కడ ఆఫర్ ట్యాప్‌ని పరిశీలించి, లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీరు గూగుల్ పే శాచెట్ లోన్ ఎంచుకొని ఎంత రుణం కావాలో వివరాలు ఇవ్వాలి. తర్వాత KYC పూర్తి చెయ్యాలి. చివరిగా టెర్మ్స్ అండ్ కండీషన్స్ చదివి.. సబ్‌మిట్ క్లిక్ చెయ్యాలి. మీరు రుణం ఎప్పటిలోగా చెల్లిస్తారో వివరాలు ఇవ్వొచ్చు. అంతా అయ్యాక మీకు ఒక OTP వస్తుంది. అది ఎంటర్ చెయ్యగానే, మీ దరఖాస్తు విజయవంతంగా సబ్‌మిట్ చేసినట్లవుతుంది.మీరు దరఖాస్తు పంపిన కొన్ని నిమిషాల్లోనే గూగుల్ పే నుంచి మీరు ఇచ్చిన బ్యాక్ అకౌంట్‌లోకి లోన్ వస్తుంది. ఐతే.. ప్రాసెసింగ్ ఫీజు + GST వంటి ఛార్జీలను మినహాయించుకొని, మిగతా అమౌంట్‌ను ఇస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోన్‌ని గూగుల్ డైరెక్టుగా ఇవ్వదు. ఇది మధ్యవర్తిలాగా వ్యవహరిస్తుంది. మీరు చెల్లించాల్సిన డబ్బు.. ప్రతీ నెలా ఆటోమేటిక్‌గా మీ అకౌంట్ నుంచి తగ్గుతూ ఉంటుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు