IT Jobs: ఐటీ ఉద్యోగం కోసం వెతుకున్నారా? ఆ స్కిల్ ఉంటే లక్షల్లో జీతం.. ఓ లుక్కేయండి ఉన్న ఉద్యోగాలే ఎప్పుడూ ఊడిపోతాయో తెలియని స్థితిలో ఉన్న టెక్కీలకు ఓ గుడ్ న్యూస్. సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉన్న వారికి నేడు చాలా డిమాండ్ ఉందని..రాబోయే రోజుల్లో వారికి మరింత డిమాండ్ పెరిగే అవకాశాలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. By Bhavana 18 Nov 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఎప్పుడూ ఉద్యోగం నుంచి తీసేస్తారో తెలియక చాలా ప్రముఖ కంపెనీ ఉద్యోగులు దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులాగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఓ శుభవార్త. కొన్ని ప్రత్యేక స్కిల్స్ ఉండే టెక్కీలకు మాత్రం డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతుందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఈ వార్త టెక్కీల్లో కొత్త ఆశలు రేపుతోంది. ఆ స్కిల్స్ ఏంటి అంటే..సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన స్కిల్స్ ఉన్న నిపుణులకు రోజురోజుకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిపోతుంది. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ స్కిల్స్ కలిగిన ఉద్యోగుల కొరత ఏర్పడింది. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలు కలిగిన నిపుణుల డిమాండ్ సుమారు 30 లక్షలకు పైగా ఉన్నట్లు సమాచారం. సైబర్ - సెక్యూరిటీ సంస్థ ఫోర్టినెట్ నివేదిక ప్రకారం.. 92 శాతం భారతీయ సంస్థలు 2022లో సైబర్ ఉల్లంఘనలను ఎదుర్కొన్నాయని వెల్లడైంది. ప్రస్తుతం కంపెనీలు తక్కువ మంది సైబర్ సెక్యూరిటీ టీమ్ లను కలిగి ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం సైబర్ నిపుణుల కొరతే అని తెలుస్తోంది. పెరుగుతున్న సైబర్ ముప్పు ల్యాండ్‌స్కేప్ లో ముందుకు దూసుకుపోవడానికి సంస్థలు సైబర్ సెక్యూరిటీ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరమని ఫోర్టినెట్ ప్రతినిధి విశాక్ రామన్ పేర్కొన్నారు. పైగా సైబర్ దాడుల వల్ల కంపెనీలు భారీగా డబ్బును చెల్లించాల్సి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం 69 శాతం భారతీయ సంస్థలు రాబోయే ఏడాది కాలంలో సైబర్ ఎటాక్ ల సంఖ్య పెరుగుతాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉన్న టెక్కీలకు బంగారు భవిష్యత్తు ముందుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. Also read: అయ్యప్ప సన్నిధానంలో ప్రారంభమైన దర్శనాలు..పోటెత్తిన మాలధారులు! #technology #jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి