TET: బీఈడీ, డీఈడీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్..రెండ్రోజుల్లో టెట్ నోటిఫికేషన్..!!

ఏపీలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. టెట్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. 2022,2023లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి డీఎస్సీలో అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో టెట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

New Update
TET: బీఈడీ, డీఈడీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్..రెండ్రోజుల్లో టెట్ నోటిఫికేషన్..!!

TET:  ఏపీలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ (Tet Notification)జారీ చేశారు. అప్పుడు 4.50లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ దాదాపు 2లక్షల మంది మాత్రమే అర్హత సాధించారు. ఈసారి సుమారు 5లక్షల మంది టెట్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ. ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది.

ఇక టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ..అభ్యర్థులకు మేలు చేసేవిధంగా నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్ 2ఏ రాసేందుకు డిగ్రీలో 50శాతం మార్కులు తప్పనిసరన్న నిబంధన ఇదివరకు ఉండేది. దాన్ని సవరించి ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ కు ఆ మార్కులను 40శాతానికి కుదించింది. ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్ లో 50శాతం మార్కులు తప్పనిసరని పేర్కొంది. దీంతో ఎక్కువమంది అభ్యర్థులు టెట్ రాసేందుకు అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్..ఇలా చెక్ చేసుకోండి..!!

అటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులను(Un-Employees) తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రభుత్వం త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 31న జరగబోయే కేబినెట్ భేటీలో మంత్రులు ఆమోదం తెలపనునట్లు సమాచారం. అయితే ఎన్నికలకు ఇంకా 70 రోజులే ఉన్నాయన్న సీఎం జగన్.. ఈ 70 రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారా? లేదా? ఎన్నికల తరువాత పరీక్షలు నిర్వహిస్తారా? అనే గందరగోళంలో ఏపీ నిరుద్యోగులు ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పిఆర్సీకి రిపోర్ట్ వచ్చే లోపు ఐఆర్ పై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు