Gold Rate Today : బిగ్‌షాక్...ఒక్కరోజే రూ. 750 పెరిగిన బంగారం ధర..తులం ధర ఎంతుందంటే..? పసిడి ప్రియులకు భారీ షాకిచ్చాయి బంగారం ధరలు. ఒక్కరోజే తులం ధర ఏకంగా రూ. 750 పెరిగింది. హైదరాబాద్ లో క్యారెట్ల బంగారం ధర రూ. 750 పెరిగి 58,100కు చేరకుంది. 24 క్యారెట్ల పసిడి ధర 820 పెరిగి 63వేల 380కి చేరింది. By Bhoomi 30 Nov 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి షాకిస్తున్నాయి బంగారం ధరలు. మొన్నటివరకు తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు..గత రెండు మూడు రోజులుగా మరింత ప్రియంగా మారుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతుండటం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరల పెరుగుదలకు కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వెండి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. నేడు పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 750 మేర పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కొనాలనుకునేవారికి ధరలు షాకిస్తున్నట్లుగానే చెప్పాలి. అటు వెండు కూడా నేడు భారీగానే పెరిగింది. కిలోపై రూ. 700 మేర పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్, ఢిల్లీలో నేడు బంగారం తులం ధర, వెండి కిలో ధర ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: ఓటు వేసాక…పొరపాటున ఈ పని చేయకండి…చేశారో అరెస్ట్ తప్పదు..!! అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు గరిష్ట దిశగా పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం ఔన్సుకు 2046 డాలర్లు పైగా ట్రేడ్ అవుతోంది. ఇక వెండి ధర ఔన్సుకు 25 డాలర్లకు చేరుకుంది. భారతరూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 83.348 వద్ద ట్రేడ్ అవుతోంది. రూ. 750 పెరిగిన పసిడి ధర: హైదరాబాద్ (Hyderabad) మార్కెట్లో నేడు ఒక్కరోజే తులం బంగారం రూ. 750 పెరిగింది. ప్రస్తుతం 22క్యారెట్ల బంగారం ధర నేడు 10 గ్రాములకు రూ. 750 పెరిగి 58, 100కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 820 పెరిగి రూ. 63,380 కి చేరుకుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rate) తులానికి 58,250 ఉండగా...24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 820 పెరిగి రూ. 63,530 పలుకుతోంది. రూ. 700 మేర పెరిగిన సిల్వర్ ధర: అటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ. 700 పెరిగింది. దీంతో కిలో వెండి ధర (Silver Price) ప్రస్తుతం రూ. 82,200 పలుకుతోంది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 700 పెరిగి ప్రస్తుతం రూ. 79,200 మార్క్ కు చేరుకుంది. హైదరాబాద్ లో వెండి రేటు ఎక్కువగా ఉంది. #gold-price-today #gold-rate-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి