3వరోజు తగ్గిన బంగారం,వెండి ధరలు!

నేడు 3వ రోజు బంగారం,వెండి ధరలు తగ్గుదల కొనసాగుతుంది.హైదరాబాద్‌లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,850 వద్ద ఉంది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,850గా.. దేశీయంగా కిలో వెండి పై రూ.100 వరకు తగ్గింది.

New Update
3వరోజు తగ్గిన బంగారం,వెండి ధరలు!

జూలై 23న కేంద్ర బడ్జెట్‌ లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.ఈ నేపథ్యంలో బంగారం ధరలు వరుసగా 3వ రోజు తగ్గాయి. హైదరాబాద్‌లో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,850 వద్ద కొనసాగుతోంది.విజయవాడలో 10 గ్రాముల తులం బంగారం ధర రూ. 64,940కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,850గా ఉంది.విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,940 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,850గా ఉంది.చెన్నైలో  22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.60 తగ్గింది. ఒక గ్రాము బంగారం రూ.6,430 గా ఉంది.

గురువారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు, ముంబయి, పుణెలో కిలో వెండి ధర రూ. 87,400కి చేరింది. అలాగే హైదరాబాద్‌, చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 91,900 వద్ద కొనసాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు