Gold Prices : పండుగ వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు..వెంటనే కొనేయండి మరీ!

పసిడి ప్రియులకు ఓ గుడ్‌ న్యూస్‌. బంగారం ధరలు నిన్నటి ధరలతో పోలిస్తే శుక్రవారం నాడు ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 100 కిందకి దిగి వచ్చింది

New Update
Gold Prices : పండుగ వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు..వెంటనే కొనేయండి మరీ!

Gold Prices Downfall  : దేశ వ్యాప్తంగా పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి(Sankranti)  ముందు పసిడి ప్రియులకు ఓ గుడ్‌ న్యూస్‌. బంగారం ధరలు(Gold Price)  నిన్నటి ధరలతో పోలిస్తే శుక్రవారం నాడు ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 100 కిందకి దిగి వచ్చింది. దీంతో నేటి మార్కెట్లో బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 600 కి చేరింది.

వెండి ధరలు మాత్రం..

ఈ క్రమంలోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120 తగ్గి రూ. 62, 830 వద్ద స్థిరపడింది. బంగారం ధరలు ఇలా ఉండగా వెండి ధరలు(Silver Price) మాత్రం అలాగే ఉన్నాయి. కేజీ వెండి ధర రూ. 76,000 వద్ద స్థిరంగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర . రూ. 58,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,380 గా ఉంది.

విజయవాడలో కూడా..

పూణె(Pune) లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,600 గా ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర . రూ. 62,830 గా ఉంది. హైదరాబాద్‌(Hyderabad) లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,600 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62, 830 గా కొనసాగుతుంది. విజయవాడలో కూడా ఇవే రేట్లు ప్రస్తుతం ఉన్నాయి.

హైదరాబాద్ లో కేజీ వెండి..

వెండి ధరలు శుక్రవారం నాడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 7,600 లుగా ఉంది. కేజీ వెండి ధర 76 వేల రూపాయాలకు చేరుకుంది. గురువారం కూడా ఇదే ధర పలికింది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 77,500 గా ఉండగా, కోల్‌ కతా(Kolkata) లో రూ.76 , 000 ఉండగా, బెంగళూరులో రూ. 73,500 గా ఉంది.

ఏది ఏమైనప్పటికీ పండుగ ముందు బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా పండుగ తరువాత భారీగా వివాహ ముహుర్తాలు కూడా ఉండడంతో బంగారం కొనేందుకు ప్రజలు బంగారం షాపులకు క్యూ కడుతున్నారు.

Also read: కెమెరా ముందుకు అల్లు అర్జున్‌ భార్య.. అయితే సినిమాలో కాదు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.

New Update
ap cabinet

ap cabinet Photograph: (ap cabinet)

అమెరికాల టారిఫ్ ల భారం ప్రభావం ఏపీపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకునే మత్స్య ఉత్పత్తులపై 27 శాతం ఇంపోర్ట్ టారిఫ్‌ను ట్రంప్ విధించిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బ ఇప్పుడు గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులకు చాలా గట్టిగా తగిలింది. దీంతో తాము చాలా నష్టపోయామని.. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిషయం గురించి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు రైతులు, వ్యాపారులు, హేచరీలు, దాణా తయారీ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారానికి కేంద్రంతో సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. 

Also Read: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలకమని, ఆక్వా రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారులకు సూచించారు. 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని కోరారు. ఆక్వా రంగం సమస్యల పరిష్కారం కోసం 11 మందితో కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

సుంకాల భారం నుంచి బయటపడటానికి, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కమిటీలో ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు, ఎంపెడా ప్రతినిధులు, ఎగుమతిదారులు.. మొత్తం 11 మంది ఉంటారు. రైతుల నుంచి కె.రఘు, కుమారరాజు, రామరాజు (ఏపీఐఐసీ ఛైర్మన్‌), శ్రీకాంత్‌.. ఎగుమతిదారుల నుంచి కె.ఆనంద్, ఆనంద్‌కుమార్, ఎన్‌.వెంకట్, డి.దిలీప్‌.. హేచరీల ప్రతినిధులుగా పీవీబీ కుమార్, ఎస్‌ఎస్‌ఎన్‌ రెడ్డి, ఫీడ్‌ మిల్లుల తరఫున సుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉంటారు. ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో చర్చించి రెండు, మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆ కమిటీకి చంద్రబాబు సూచించారు.

ఈ క్రమంలో దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఎగుమతిదారులు అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్రంతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని.. మళ్లీ సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఆక్వా సాగులో 3 లక్షల మంది రైతులున్నారని.. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 50 లక్షల మంది ఆధారపడి ఉన్నారన్నారు. ఇది ఊహించని సమస్య అని.. ఈ సమస్య పై రైతులు ఓపికగా ఉండాలన్నారు.

ఆక్వా ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాల భారాన్ని రైతుల పైకి నెట్టకుండా వ్యాపారులు, ఫీడ్‌మిల్లులు, హేచరీలు బాధ్యత తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రొయ్యకు స్థానిక వినియోగం పెంచేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ పరిస్థితి చక్కబడే వరకు రైతుకు ధైర్యం కల్పించాలని.. రైతుకు గిట్టుబాటు రేటు ఇచ్చేలా వ్యాపారులు చూడాలి అన్నారు. కొంతమంది రైతులు క్రాప్ హాలిడే అని ప్రకటించడంతో.. ఈ అంశంపైనా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చర్చించనుంది.

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

Also Read: Maoists surrender : పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

cbn | trump | tarriffs | trump tariffs | trump tariffs india | trump tariffs news | trump tariff war | donald trump tariffs | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment