Gold Price: పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత తగ్గాయంటే.. భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.200 తగ్గి రూ.57,200ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 200 తగ్గి రూ.63,050కు చేరింది. ఇక వెండి ధర కేజీకి రూ.77,800 వద్ద ఉంది. By KVD Varma 09 Jan 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Gold Price: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. బంగారం కొనాలని అనుకునేవారికి రికార్డు స్థాయిలోకి వెళ్లిన బంగారం ధరలతో టెన్షన్ మొదలైంది. అయితే, ఇప్పుడు కొద్ది కొద్దిగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. రెండు రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కాస్త కిందికి దిగివచ్చాయి. అంతకుముందు కూడా వరుసగా మూడు రోజులు బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే వారం రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయని చెప్పవచ్చు. దాదాపుగా 10 గ్రాములకు 1000 రూపాయల తగ్గుదల కనిపిస్తోంది. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే బంగారం ధరల్లో తగ్గుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ తగ్గుతూ రావడం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలు(Gold Price) తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. ఈరోజు అంటే జనవరి 09న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరల్లో కాస్త తగ్గుదల కనిపించడంతో దేశీయంగాను బంగారం ధరలు దిగి వచ్చాయి. మరోవైపు రెండురోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధరలు కూడా ఈరోజు తగ్గాయి. ఈరోజు అంటే మంగళవారం (జనవరి 09) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో బంగారం ధరలు: హైదరాబాద్(Hyderabad) లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price) 200రూపాయలు తగ్గింది. దీంతో రూ.57,800ల వద్ద చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం కూడా 200 రూపాయలు తగ్గి రూ. 63,050ల వద్దకు చేరింది. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయలు తగ్గి రూ.57,950ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది దీంతో రూ.63,200ల వద్దకు చేరుకుంది. Also Read: బంగారం ధరలు దిగి వస్తున్నాయి..వెండి ధర భారీగా పడిపోయింది..ఈరోజు ఎంతుందంటే.. వెండి ధరలు ఇలా: ఇక నిన్నస్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు కాస్త తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధరలు 200 రూపాయల మేర తగ్గాయాయి. దీంతో హైదరాబాద్ లో వెండి కేజీకి రూ.77,800ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 200 రూపాయలు తగ్గింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 76,400 లుగా నిలిచింది. మరోవైపు అంతర్జాతీయంగానూ బంగారం ధరలు(Gold Price) తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Price) 2035డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 23 డాలర్లుగా కొనసాగుతోంది. గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం. Watch this interesting Video: #gold-price #gold-and-silver-latest-prices మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి