Badhrachalam: భద్రాచలం వద్ద మరోసారి పెరుగుతున్న గోదావరి! భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరోసారి పెరుగుతుంది. రెండు రోజుల క్రితం 51.6 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం మంగళవారం తగ్గుముఖం పట్టింది. రాత్రి 45 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతూ 47.3 అడుగుల వద్దకు చేరింది. By Bhavana 25 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Bhdrachalam: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరోసారి పెరుగుతది. రెండు రోజుల క్రితం 51.6 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం మంగళవారం నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టింది. రాత్రి 45 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతూ గురువారం ఉదయం 9 గంటల సమయానికి 47.3 అడుగుల వద్దకు చేరింది. 10 గంటల సమయంలో 47.5 అడుగుల కు చేరింది. గోదావరి నీటిమట్టం పెరగడంతో భద్రాచలం వద్ద స్నానఘట్టల ప్రాంతం, కల్యాణ కట్ట ప్రాంతం ఇంకా వరద నీటిలోనే మునిగి ఉంది. దుమ్ముగూడెం మండలం వద్ద సీత వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వరద నీటిలోనే మునిగి ఉంది. చర్ల మండలంలోని తాళి పేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద వల్ల 25 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువన ఉన్న గోదావరి లోకి విడుదల చేస్తున్నారు. నీటిమట్టం పూర్తిగా తగ్గకపోవడం వల్ల భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే ప్రధాన రహదారులపై వరద నీరు మాత్రం తగ్గలేదు. దీంతో ఆ గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. Also read: ముంబై నగరాన్ని ముంచెత్తిన వాన #rains #floods #godavari #badhrachalam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి