Viral Goat : ఇది మామూలు మేక కాదు బాబోయ్.. ఏకంగా రూ.7 లక్షలు పలికింది! మాంస ప్రియులను ఆశ్యర్యపరిచేలా ఓ మేక భారీ ధర పలికింది. బక్రీద్ సందర్భంగా రాఫ్తార్ జాతికి చెందిన మేక ఏకంగా రూ.7 లక్షలకు అమ్ముడైంది. మధ్యప్రదేశ్ కు చెందిన సయ్యద్ షహాబ్ దీనిని విక్రయించగా ఈ వార్త వైరల్ అవుతోంది. By srinivas 16 Jun 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Golden goat: మాంస ప్రియులను ఆశ్యర్యపరిచేలా ఓ మేక భారీ ధర పలికింది. సాధారణంగా 5 నుంచి 10 వేలు పలకాల్సిన మేక ఏకంగా రూ.7 లక్షలు పలకడం సంచలనంగా మారింది. బక్రీద్ సందర్భంగా దేశంలో మాంసం ధరలు ఆకాశాన్ని అంటుతుండగా.. వీటిల్లో కొన్ని రకాల జాతులకు ఎక్కువ ధర పలుకుతాయి. అందులో ఇదొకటి రాఫ్తార్ మేక. #WATCH | Madhya Pradesh: A goat seller in Bhopal is selling goats priced between Rs 50,000 to Rs 7.5 lakhs, ahead of Eid-al-Adha or Bakrid tomorrow. pic.twitter.com/rvWWjLQvGa — ANI (@ANI) June 16, 2024 ఈ మేరకు రాఫ్తార్ జాతికి చెందిన మేకలు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంటుంది. వీటి కొనుగోళ్లు ఎక్కువగా బక్రీద్ పండుగ సమయంలో జరుగుతాయి. ఈ మేక ధర దాదాపు 50 వేల నుంచి మొదలుకొని 7.5 లక్షలకు పైగా పలుకుతుందని గోట్ సెల్లర్స్ చెబుతున్నారు. అయితే భోపాల్ మార్కెట్ లో మధ్యప్రదేశ్ కు చెందిన సయ్యద్ షహాబ్ అనే మేకల విక్రయదారుడు రాఫ్తార్ బ్రీడ్ కు చెందిన 155 కేజీల మేకను 7 లక్షలకు అమ్మినట్టు తెలిపారు. ఇక మేక జాతి అన్నింటిలో కంటే ఎక్కువ దూకుడు ప్రదర్శించడం దీని లక్షణమని చెప్పారు. ఇది 150 కేజీల పైనే పెరుగుతుందని, ఇది దాడి చేస్తే మనిషి ప్రాణాలు సైతం కోల్పోతాడని చెప్పారు. ఈ జాతి మేకలను బక్రీద్ కోసం స్పెషల్ గా పెంచుతారని, ఈ సమయంలోనే ఎక్కువ విక్రయాలు జరుగుతాయని అంటున్నారు. వీటితో పాటు షాన్- ఈ అనే జాతి మేక కూడా బక్రీద్ సమయంలో ఎక్కువగా ధర పలుకుతుందని చెబుతున్నారు. #goat #rs-7-lakhs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి