Mole: అమ్మాయిలకు అక్కడ పుట్టుమచ్చలు ఉంటే.. పట్టిందల్లా బంగారమే పుట్టుమచ్చలు మానవుడి జాతకాన్ని నిర్థేశించడంతోపాటు భవిష్యత్తులో ఆర్థికంగా కలిసి రావటానికి కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు సముద్రిక శాస్త్ర నిపుణులు. ఈ పుట్టు మచ్చలు అదృష్ట, దురదృష్టాలకు కూడా సంకేతంలా ఉంటే..కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ లాభాలును ఎక్కువగా ఇస్తుంది. By Vijaya Nimma 23 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Mole: పుట్టుమచ్చ అంటే అందరికి తెలిసిందే. చిన్నప్పుడు చదువుకునే వయసులో పుట్టుమచ్చలని గుర్తుగా రాసుకునేవాళ్లు. ఇప్పటికీ ప్రతి ఒక్కరి సర్టిఫికెట్ లో మన శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో రాసి ఉంటుంది.ఈ పుట్టుమచ్చలతో కూడా భవిష్యత్తు నిర్ణయిస్తారని సముద్రిక శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే.. ఈ పుట్టుమచ్చల వలన భవిష్యత్తులో ఆర్థికంగా కలిసి వస్తుందట. అదృష్టం గురించి కూడా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. కొందరు ఇలాంటివి నమ్మితే మరికొందరు మాత్రం వీటిని పక్కన పెట్టేస్తుంటారు. అయితే.. మహిళలకు కొన్ని స్థానాల్లో పుట్టుమచ్చలు ఉండటం వలన డబ్బులు బాగా కలిసి వస్తాయని చెబుతున్నారు. స్త్రీలకు ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే కలిసి వస్తుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెంపపై పుట్టుమచ్చ: మహిళలకు చంప మీద పుట్టుమచ్చ ఉంటే వారు నీతిపరులని గుర్తిస్తారట. అంతేకాకుండా కుడివైపు పుట్టుమచ్చ ఉన్న మహిళల కు ఆర్థికంగా జీవితాన్ని కలిగి ఉంటారు. నాభి దగ్గర పుట్టుమచ్చ ఉంటే శుభప్రదం. కుడిపాదం మీద పుట్టుమచ్చ ఉన్నవారు వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. అందాన్ని పెంచుతుంది: అదేవిధంగా.. ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే ఆర్థిక సమస్యలు ఉండటంతో పాటు జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉంటాయని చెబుతున్నారు. కొందరికి గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటుంది. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే పుట్టుమచ్చలు అందాన్ని పెంచడంతోపాటు కొన్ని విషయాలలో మొండిగా ఉంటారట. కుడిగడ్డ మీద పుట్టుమచ్చ ఉంటే దౌత్య స్వభావానికి చిహ్నమంటున్నారు. కొన్ని పుట్టుమచ్చలు మానవుడి జాతకాన్ని నిర్థేశించడంలో పుట్టుమచ్చలదీ కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు. అంతేకాకుండా వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలుతుంది. ఈ పుట్టు మచ్చలు అదృష్ట, దురదృష్టాలకు కూడా సంకేతంలా ఉంటాయట. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే లాభాలును ఇస్తుంది. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి, అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుంది.ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వాళ్లకి ఉంటాయని సముద్రిక శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి : పాలలో జాజికాయ పొడి కలిపి తింటే ఏమౌతుంది?..వైద్యులు ఏమంటున్నారు? గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #mole మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి