అయ్యో బామ్మ.. పింఛన్ కోసం రెండు కిలోమీటర్లు పాకుతూ వెళ్లిన గిరిజమ్మ

కర్నాటకలో హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. గిరిజమ్మ అనే 77ఏళ్ల ఒంటరి వృద్ధురాలు ఫించన్ డబ్బుల కోసం రెండు కిలోమీటర్లు, ఎనిమిదిగంటలపాటు నెలపై పాకుతూ వెళ్లింది. రెండు నెలలుగా ఫించన్ రాకపోవడంతో ఆటో, బస్సు ఎక్కేందుకు డబ్బులు లేవని చెప్పింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

New Update
అయ్యో బామ్మ.. పింఛన్ కోసం రెండు కిలోమీటర్లు పాకుతూ వెళ్లిన గిరిజమ్మ

Karnataka: పింఛన్ కోసం ఓ బామ్మ నెలపై పాకుతూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోస్టాఫీస్‌ (Post office) కు వెళ్లిన హృదయవిదారకర సంఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. సంతానం లేకపోవడం, కట్టుకున్న భర్త చనిపోవడం, వయసు పైబటడంతో ఒంటరిగా మిగిలిన వృద్ధురాలు.. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్ తోనే కాలం గడుపుతోంది. ప్రతినెల ఆటో, బస్సులకు వెళ్లిన ఆమె పింఛన్ ఆలస్యం కావడంతో దారి ఖర్చులు లేక పాకుతూ వెళ్లడం జనాలను కదిలించగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

కర్నాటకలోని దావణగెరె జిల్లాలోని హరిహర్ తాలూకాకు చెందిన మహిళ గిరిజమ్మ (77)కు జీవనాధారమైన పింఛను డబ్బు 2నెలలుగా రాలేదు. అడిగితే పోస్టుమాన్ విసుక్కుంటున్నాడని, దీంతో రోడ్డుపై దేకుతూ 8 గంటల పాటు ప్రయాణించి 2 కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీసుకు చేరుకుంది.

ఇది కూడా చదవండి : Ravi Bishnoy: ఎముకలు కొరికే చలిలో బౌలింగ్.. బెంబేలెత్తుతున్న బౌలర్లు

ఇక దీనిపై మాట్లాడిన గిరిజమ్మ.. తనకు ప్రతినెలా రూ.10,000 పింఛన్‌ వచ్చేదని, సాధారణంగా ప్రతినెలా పోస్టాఫీసు ద్వారా తనకు వచ్చే నిధులు 2023 నవంబర్ నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఆగిపోయాయని గిరిజమ్మ ఆరోపించారు. దీంతో బస్సు, ఆటోరిక్షా ప్రయాణానికి డబ్బులు లేకపోవడంతో రెండు కిలోమీటర్లు ఇలాగే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. వారం క్రితం జరిగిన ఈ సంఘటన వీడియో వైరల్ అవుతుండగా.. అధికారులపై ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీంతో వెంటనే అధికారులు వృద్ధురాలిని హరిహర దవాఖానలో చేర్పించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో రెవెన్యూ అధికారికి చేరిందని, ఆమె పింఛన్‌ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు