Street Dogs: మీ ఏరియాలో వీధి కుక్కల బెడద ఉందా?.. అయితే.. వెంటనే ఈ నంబర్ కు ఫోన్ చేయండి! జీహెచ్ఎంసీ అధికారులు కీలక ప్రకటన చేశారు. వీధి కుక్కల బెడద ఉంటే.. టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. వెంటనే ఆ ఏరియాకు తమ టీంలు వచ్చి అక్కడి వీధి కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తాయని తెలిపారు. By Nikhil 25 Jul 2024 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఇటీవల రాష్ట్రంలో వీధి కుక్కల బెడద ఎక్కువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఏరియాలో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. జవహర్ నగర్, ఇస్నాపూర్ లో వీధి కుక్కల దాడిలో చిన్నారులు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఈ అంశాన్ని హైకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి విచారణ నిర్వహిస్తోంది. విధి కుక్కల దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయిందని విచారణ సందర్భంగా పలు మార్లు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా చదవండి: Stray Dog Attack: వీధి కుక్కలు దాడి నుంచి తప్పించుకోవడానికి ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి! మీ ఏరియాలో కుక్కల బెడద ఉందా? టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మా డాగ్ క్యాచింగ్ టీంలు నేరుగా వచ్చి వీధి శునకాలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తాయి. #StreetDogsMenace #GHMC #TollFreeNumber pic.twitter.com/21VyPUv61j — GHMC (@GHMCOnline) July 24, 2024 వీధి కుక్కల బెడద ఉంటే తమకు ఫోన్ చేయాలని టోల్ ఫ్రీ నంబర్లను ప్రకటించారు. మీ ఏరియాలో వీధి కుక్కల బెడద అధికంగా ఉంటే.. టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే జీహెచ్ఎంసీ డాగ్ క్యాచింగ్ టీంలు వచ్చి ఆ ఏరియాలోని శునకాలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తాయని తెలిపారు. ఒక్క కాల్ తో వీధి కుక్కల సమస్యకు పరిష్కారం లభిస్తుందని జీహెచ్ఎంసీ పేర్కొంది. ఇది కూడా చదవండి: Street Dogs in Hyd: వీధి కుక్కల దాడులు.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి