Hyderabad : నేడే ఘట్​కేసర్–లింగంపల్లి ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం!

ఘట్ కేసర్ -లింగంపల్లి వరకు వెళ్లే ఎంఎంటీఎస్ రైలు సర్వీసు నేడు మొదలుకానుంది. ఉదయం 10.30 గం. లకు ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు రైల్వే డీఆర్ఎం భరతేశ్​కుమార్ జైన్ తెలిపారు. దీనిపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Hyderabad : నేడే ఘట్​కేసర్–లింగంపల్లి ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం!

MMTS Train : హైదరాబాద్(Hyderabad) వాసులకు లోకల్ ప్రయాణం(Local Journey) మరింత సులభంగా మారనుంది. నగరవ్యాప్తంగా పనుల కోసం పరుగులు పెట్టే జనాలకు భారీ ఊరట లభించనుంది. అతి తక్కువ టికెట్ ధరతో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వెసులుబాటు నేటితో మొదలుకానుంది. ఈ మేరకు ఘట్ కేసర్ నుంచి లింగంపల్లి వరకు వెళ్లే ఎంఎంటీఎస్ రైలు సర్వీసును ప్రధాని మోడీ నేడు(PM Modi) వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

మౌలాలి, -సనత్ నగర్..
గ్రేటర్ హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టు(MMTS Phase-2 Project) లో భాగంగా ఘట్ కేసర్(Ghatkesar) నుంచి మౌలాలి(Moula Ali), -సనత్ నగర్ మీదుగా లింగంపల్లి(Lingampalli) వరకు నడిచే రైలును ప్రధాని ఈ రోజు జెండా ఊపి ప్రారంభించనున్నారని దక్షిణమధ్య రైల్వే డీఆర్ఎం భరతేశ్​కుమార్ జైన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: TS : గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఈ అవకాశం మళ్లీ రాదు!

మంగళవారం ఉదయం గం. 10.30 లకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఎన్నో ఏళ్లుగా దీనికోసం ఎదరుచూస్తున్న స్థానిక ప్రజలు నేటినుంచి రైలు సర్వీసు సేవలు మొదలుకానుండగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై గంటల తరబడి నిరీక్షణలుండవని, తొరగా ఆఫీసు, ఇళ్లలోకి చేరుకోవచ్చంటూ సంతోషపడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు