Saturday Shani Dosh : శనిదోషం వదలట్లేదా? ఇలా చేస్తే విముక్తి పొందుతారు!

శనిదేవుని అనుగ్రహం పొందడానికి శనివారం నల్ల నువ్వులు, నల్ల గొడుగు, ఆవనూనె, నల్ల పెసరపప్పు, బూట్లు, చెప్పులు దానం చేయాలి. అలాగే శనివారం నాడు శని చాలీసా పఠించాలి. శనిదోషం తొలగిపోవడానికి రావిచెట్టును ఆరాధించండి. శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఆయన మంత్రాలను పఠించాలి.

New Update
Saturday Shani Dosh : శనిదోషం వదలట్లేదా? ఇలా చేస్తే విముక్తి పొందుతారు!

Get Rid of Shani Dev : శని దేవుడి(Shani Dev) అంటే న్యాయానికి చిహ్నం. కర్మ ఫలాలు ఇచ్చేవాడు కూడా ఆయనే. చేసిన కర్మలకు అనుగుణంగా ఏం చేయాలో అది చేస్తాడు. అందుకే శనిదేవుడికి జడ్జ్‌ అంటారు. సత్కర్మలు చేసే వ్యక్తికి శనీశ్వరుని అనుగ్రహం ఉంటుందని చెబుతారు. మరోవైపు చెడు పనులకు పాల్పడే వ్యక్తిపై శనిదేవుడి కోపం కురిపిస్తాడు. శనిదేవుడిని పూజించడానికి శనివారం ఉత్తమమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున శని మహారాజును పూజించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఒకవేళ వ్యక్తి జాతకంలో శని దోషం(Shani Dosh) ఉంటే శనివారం తీసుకునే కొన్ని నివారణలు ఉపశమనం కలిగిస్తాయి. అవేంటో తెలుసుకుందాం!

--> శనివారం(Saturday) శనిదోషం తొలగిపోవడానికి రావిచెట్టును ఆరాధించండి. శనివారం నాడు సూర్యోదయానికి ముందే రావిచెట్టును పూజించడం, నీరు సమర్పించడం, నూనె దీపం వెలిగించడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది.

--> శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఆయన మంత్రాలను పఠించాలి. అలాగే ఈ రోజున శని చాలీసా(Shani Chalisa) పఠించాలి.

--> శనివారం నాడు హనుమంతుడిని పూజించడం ద్వారా ఆయన సంతోషిస్తాడు. ఇక శని దేవుడి ఆశీస్సులు పొందడానికి జాతకం నుంచి శని దోషాన్ని తొలగించడానికి హనుమంతుడిని పూజించాలి.

--> శనిదేవుని అనుగ్రహం పొందడానికి శనివారం నల్ల నువ్వులు, నల్ల గొడుగు, ఆవనూనె, నల్ల పెసరపప్పు, బూట్లు, చెప్పులు దానం చేయాలి. ఇది జీవితంలోని సమస్యలను తగ్గిస్తుంది. శని దోషాన్ని కూడా నివారిస్తుంది.

ముఖ్య గమనిక: ఈ ఆర్టికల్‌ ఇంటర్‌నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ కథనం నిజమని చెప్పడానికి ఎలాంటి శాస్త్రియ ఆధారాలు లేవు.

Also Read : పిల్లలకు దగ్గు సిరప్‌ ఇచ్చేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..చాలా ప్రమాదం

Advertisment
Advertisment
తాజా కథనాలు