Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

author-image
By Manogna alamuru
New Update
sitaram

Sitaram Yechury :

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. ఎన్నో ఎత్తులు–పల్లాలు.విద్యార్ధి దశనుంచి ప్రశ్నించే తత్వ్తం ..ఉన్నతస్థాయి చదువు.. పోరాటాలే జీవన గమనం..దేనికైనా తెగించే గుణం ఇవే సీతారాం ఏచూరిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి. ప్రముఖ భారతదేశ రాజకీయ నాయకుడు, కమ్యూనిస్ట్ యోధుడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో పార్లమెంటరీ వర్గపు నాయకుడు. విశాఖపట్నం (Vizag) లో జరిగిన సీపీఎం మహాసభల్లో అతను పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. సీనియర్‌ కామ్రేడ్ ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై పోటీ నుంచి వైదొలగటంతో సీతారాం ఎన్నికైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్ ప్రకటించారు. అంతకుముందు సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ కారత్ వరుసగా మూడుసార్లు పని చేశారు.

Also Read :  బ్యాడ్‌ న్యూస్‌..రెండు రోజుల పాటు వైన్‌ షాపులు..!

ఈరోజు సీతారాం ఏచూరి (Sitaram Yechury) లేరన్న విషయం చాలామందికి మింగుడు పడని విషయం. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఒక ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఇందిరాగాంధీ పక్కన నిల్చుని ఉండగా ఏచూరి ఏదో చదువుతున్నారు. ఇది 1977లో తీసిన చిత్రం. అప్పట్లో ఇందిరాగాంధీ జేఎన్‌టీయూ వైస్‌ ఛాన్సలర్‌‌గా ఉండేవారు. అప్పుడు సీతారాం విద్యార్ధి నాయకుడుగా ఉన్నారు. ఒకరోజు విద్యార్థి బృందాన్ని వేసుకుని ఆయన ఇందిరాగాధీ ఇంటికి చేరుకున్నారు. ఆమెదగ్గరకు వెళ్ళి మాట్లాడాలనుకున్నారు. అయితే ఇందిర...తానే బయటకు వచ్చి వారదరితో మాట్లాడింది. వారి డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు. అంతలోనే సీతారాం ఇందిరాగాంధీ తన పదవికి రాజీనామ చేయాలంటూ డిమాండ్ చదివి వినిపించారు. దాన్ని కూడా ఇందిరా స్వాగతించారు. వారి డిమాండ్ మేరకు తరువాత రాజీనామా కూడా చేశారు. ప్ర్తుతం వైరల్ అవుతున్న పిక్ ఆ సదంర్భంలోనిదే. దేశ రాజకీయాల్లో ఐరన్‌ లేడీగా పేరున్న ఇందిర పక్కన నిల్చుని.. ఆమె రాజీనామాకే డిమాండ్‌ చేసిన ఆ విద్యార్థి నాయకుడే సీతారాం ఏచూరి.ఇదంతా ఎమరెజెన్సీ తర్వాత జరిగింది అప్పట్లో ఇందిరా ఎన్నకల్లో తన ప్రధాని పదవిని కోల్పోయి జేఎన్‌టీయూ వైస్‌ ఛాన్సలర్‌‌గా పనిచేసేవారు.

జేఎన్‌యూ విద్యార్థి నాయకుడుగా సీతారాం ఏచూరి యూనిర్శిటీ మీద తనదైన ముద్ర వేశారని చెబుతారు. వామపక్ష భావజాలం వ్యాప్తికి దోహదం చేశారని గుర్తు చేసుకుంటారు. ప్రకాశ్ కారత్‌ కలిసి ఈయన వేసిన పునాదులే ఇప్పటికీ జెఎన్‌యూ పై ఎస్‌ఎఫ్‌ఐ పట్టుకు కారణమని అంటారు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ షేర్ చేశారు. దాంతో పాటూ ఆనాటి విషయాలన్నింటినీ గుర్తుచేశారు.

Also Read :  విశాఖలో హైటెన్షన్.. స్టీల్ ప్లాంట్ కార్మికులు అరెస్ట్!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
Patanjali Chilli Powder

Patanjali Chilli Powder

Patanjali Chilli Powder: యోగా గురువు బాబా రాందేవ్(Baba Ram Dev) సారథ్యంలో పనిచేస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి తయారీ ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) నిర్ధారించింది. దీంతో  వల్లే ఆ కారం పొడిని వెనక్కి తీసుకోవాలని పతంజలి ఫుడ్స్‌కు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్దేశించింది. దీంతో ఆ పొడిని వెనక్కు తీసుకోవాలని ఆదేశించింది. ఏజేడీ2400012 బ్యాచ్‌కు చెందిన 200 గ్రాముల 4 టన్నుల కారం పొడి ప్యాకెట్లను మార్కెట్ నుంచి వెనక్కు రప్పిస్తోంది. 

Also Read: Maoist: ఈ నేలపై నక్సలిజం చావదు.. ప్రభుత్వాలవి నీటిపై రాతలే: RTVతో పౌరహక్కుల నేత!

మోతాదుకు మించి క్రిమిసంహారకాలు..

పతంజలి ఫుడ్స్‌ సీఈవో సంజీవ్‌ ఆస్థానా ఈ విషయాన్ని ధృవీకరించారు. "మేము మార్కెట్‌ నుంచి 200 గ్రాములకు చెందిన 4 టన్నుల  కారం పొడి ప్యాకెట్లను వెనక్కు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కారం పొడి ప్యాకెట్లలో మోతాదుకు మించి క్రిమిసంహారకాలు ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు తేల్చి చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

Also Read: ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!

వినియోగదారులు కొనుగోలు చేసిన మిర్చి పౌడర్‌ను మా డిస్ట్రిబ్యూటర్లు వెనక్కు తీసుకుంటారు. ఆ వెంటనే వారికి వారి డబ్బులు తిరిగి చెల్లి్స్తారు అని తెలిపారు. అలాగే మేము మిర్చి కొనుగోలు చేస్తున్న సంస్థలతో మాట్లాడుతాం. పంట ఉత్పత్తుల్లో క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉండకుండా జాగ్రత్తపడుతాం. ఇప్పటి నుంచి భారత ఆహార భద్రతా(Food Safety) ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSI)  ప్రమాణాలకు అనుకూలంగా ఉండే మిర్చిని మాత్రమే కొని పొడి తయారు చేస్తామని స్పష్టం చేశారు.

Also Read: MEGHA Fraud: తెలంగాణలో మేఘా పెట్టుబడుల వెనుక సీక్రెట్ ఇదే.. అసలు బాగోతం బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే!

యోగా గురువుగా ప్రసిద్ధి చెందిన బాబా రాందేవ్ 1986లో ఈ పతంజలి ఆయుర్వేద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ రుచి గోల్డ్, న్యూట్రెలా, పతంజలి పేర్లతో వివిధ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తుంది. కాగా గతేడాది జులై-సెప్టెంబర్​ త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్ కంపెనీ నికర లాభం 21 శాతం మేర పెరిగి రూ.308.97 కోట్లకు చేరింది. దాని నికర లాభం రూ.254.53 కోట్లుగా నమోదైంది.  

Also Read:  భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు