/rtv/media/media_files/2026/03/04/holi-colors-2026-03-04-18-32-40.jpg)
holi colors
Holi Color Removal : హోళీ పండుగ అనగానే మనకు రంగులు గుర్తుకు వస్తాయి. ఈ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు.హోలీ పండుగ జరుపుకునేపుడు రంగులు పూసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. అందులో కొన్ని మొండి రంగులు చర్మాన్ని వదిలిపెట్టవు. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. దీనివల్ల చర్మానికి ఎలాంటి హాని కలగకుండా నిరోదించుకోవచ్చు. కొంతమంది రంగుల మరకలను తొలగించడానికి, కిరోసిన్, పెట్రోల్, స్పిరిట్లను ఉపయోగిస్తారు. అయితే అలాంటివి వాడటం వల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది.
చాలామంది ఒంటిపై రంగులు పడగానే వాటిని నేరుగా నీళ్లతో కడిగేస్తారు. అలా చేయడం వల్ల రంగులు ఇంకా బలంగా అంటుకుంటాయి. అలా కాకుండా రంగులు అంటుకున్న చోట ముందుగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాసి కొంత సేపు మసాజ్ చేయాలి. దానివల్ల రంగును చర్మం నుండి ఈజీగా తొలగించుకునే అవకాశం ఉంటుంది. హోలీ ఆడిన తర్వాత, చర్మం రంగుల కారణంగా దెబ్బ తింటుంది. కాబట్టి, సన్ స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోవద్దు. ఇది చర్మానికి అదనపు రక్షణను అందిస్తుంది.
ఇక హోలీ ఆడినపుడు గోళ్లకు రంగులు అంటుకోవడంతో పాటు గోళ్లలోకి రంగులు చేరుతాయి. అలా చేరిన రంగులు అంత త్వరగా పోవు. అందుకే హోలీ ఆడే ముందే గోళ్లకు డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవాలి. అయినా రంగులు అంటితే ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి, 10 నిమిషాల పాటు వేళ్లను ఆ నీటిలో నానబెట్టి ఆతర్వాత కడిగితే రంగు సులభంగా పోతుంది.
అలాగే చర్మం పై పడిన మొండి రంగులను వదిలించడానికి గరుకుగా ఉండే సబ్బులతో అతిగా రుద్దుతుంటారు. అలా చేయడం ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. దానికి బదులుగా శనగపిండి, పెరుగు, కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్టులా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రంగులు అంటిన చోట రుద్దాలి. అ పిండి ఆరిన తర్వాత దాన్ని మెల్లగా రుద్దుతూ కగిగేయాలి. అలా చేయడం వల్ల రంగు తేలికగా పోతుంది.
ముఖం అనేది చాలా సున్నితమైన భాగం. కాబట్టి ముఖంపై రంగులను తొలగించడానికి క్లెన్సింగ్ మిల్క్ లేదా మేకప్ రిమూవర్ ఉపయోగిస్తే మంచిది. అది అందుబాటులో లేకపోతే దూదిని కొబ్బరి నూనెలో ముంచి తుడవడం చేస్తే రంగులు పోతాయి. అలాగే హోలీ రంగులు చర్మంపై ఉన్నప్పుడు మేకప్ వేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఎంత శుభ్రంగా కడిగినా కొంతమేర రంగులు చర్మంపై ఉంటాయి. ఇవి స్వేద రంధ్రాల్లోకి వెళ్లి మరింత హానికలిగించే అవకాశం ఉంటుంది. అందువల్ల, హోలీ ఆడిన తర్వాత కనీసం 24 గంటల పాటు మేకప్ వేయకపోవడం మంచిది.
హోలీ సందర్బంగా జుట్టుకు కూడా రంగులు అంటుకుంటాయి. అలా అంటిన రంగులను వదిలించుకోవడానికి వెంటనే షాంపూ ఉపయోగించద్దు. ముందుగా జుట్టును మామూలు నీళ్లతో బాగా కడగాలి. ఆ తర్వాతే మైల్డ్ షాంపూ వాడితే రంగులు పోతాయి. చివరగా తప్పనిసరిగా కండీషనర్ వాడాలి, లేదంటే రంగుల్లోని కెమికల్స్ వల్ల జుట్టు పాడవుతుంది. వేడి నీళ్లతో రంగులను ఎట్టి పరిస్థితుల్లో కడగవద్దు. వేడి నీరు రంగును చర్మానికి మరింత గట్టిగా అంటుకునేలా చేస్తుంది. ఎప్పుడూ చల్లని లేదా మామూలు నీటినే వాడండి. రంగులలో ఉండే కెమికల్స్ వల్ల చర్మంపై ఒక్కోసారి దద్దుర్లు, స్కిన్ అలెర్జీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చర్మానికి ఏవైనా సమస్యలు ఎదురైతే అలోవెరా జెల్ లేదా చల్లని రోజ్ వాటర్ ను చర్మంపై అప్లై చేయాలి. అలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు.
Follow Us