Gas E-KYC: ఈ-కేవైసీ ఉంటే గ్యాస్ రాయితీ..? ఇంట్లోనే ఈకేవైసీ చేసుకోండిలా! మీరు వంటగ్యాస్ సిలిండర్ కోసం కేవైసీ వివరాలు ఇవ్వాలనుకుంటే..దానికోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచో ఈకేవైసీ చేసుకోవచ్చు. దీనికోసం www.mylpg.in సైట్ లోకి వెళ్లి చేయాల్సి ఉంటుంది. By Bhoomi 17 Dec 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మీరు వంటగ్యాస్ సిలిండర్ కేవైసీ వివరాలు ఇవ్వాలనుకుంటే దాని కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే ఈ కేవైసీ చేసుకోవచ్చు. ఎలానో తెలుసుకుందాం. చాలా మంది గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లితమ కేవైసీ వివరాలు ఇస్తుంటారు. అయితే ఇంట్లో నుంచి కూడా ఆన్ లైన్ లో ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇదేమంత కష్టం కాదు. చాలా సులభమైన పని. దీనికోసం ముందుగా మీరు www.mylpg.in సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ రైట్ సైడ్ భారత్ గ్యాస్ లేదా హెచ్ పీ గ్యాస్, లేదా ఇండేన్ సిలిండర్ అని ఉన్న ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అనంతరం ఫోన్ నెంబర్ తో సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ మీ కేవైసీ అప్ డేట్ అయ్యిందో లేదో చూసుకోవచ్చు. ఒకవేళ మీకు మీ వివరాలు కనిపించనట్లయితే...మీరు need kycపై క్లిక్ చేస్తే KYCఫారమ్ వస్తుంది. దాన్ని నింపి..మీరు గ్యాస్ పొందుతున్న ఏజేన్సీలో ఇవ్వాలి. ఆన్ లైన్ లో గానీ లేదా ఫారమ్ ఫిలప్ చేసి ఇచ్చిన తర్వాత నాలుగైదు రోజుల్లో మీ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత సబ్సిడీ ధరకు సిలిండర్ పొందే ఛాన్స్ మీకు లభిస్తుంది. ఒకవేళ మీరు కేవైసీ పూర్తి చేసి ఉంటే...ఎలాంటి సమస్యలు లేనట్లే. ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. 1890 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్! #gas-e-kyc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి