ఒక సిలిండర్ పేలి.. ఆ దాటికి మరో మూడు బ్లాస్ట్.. 15 పూరిళ్లు దగ్ధం తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఓ గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం కారణంగా 15 కుటుంబాలు నివాసాలు కోల్పోవాల్సి వచ్చింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు చెప్తున్నారు. By Naren Kumar 21 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి East Godavari: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఓ గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం కారణంగా 15 కుటుంబాలు నివాసాలు కోల్పోవాల్సి వచ్చింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు చెప్తున్నారు. ప్రమాద వశాత్తూ మొదట ఒక గ్యాస్ సిలిండర్ పేలడం, దాంతో భారీగా మంటలు వ్యాపించి మరో మూడు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఇది కూడా చదవండి: Corona JN1 : దేశంలో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. లక్షణాలివే! పేలుడు దాటికి గ్రామంలోని 15 పూరిళ్లు దగ్ధమయ్యాయి. దీంతో వారంతా రోడ్డున పడ్డారు. ముందుగా ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలు వ్యాపించాయి. క్రమంగా మంటలు వ్యాప్తి చెంది మరో మూడు గ్యాస్ సిలిండర్ల పేలుడుకు కారణమయ్యాయి. ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆస్తి నష్టం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: America : అమెరికాలో విజయవాడ మెడికల్ విద్యార్థిని మృతి..కారణం ఏంటంటే! అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రమాదం కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. #ap-news #gas-cylinder-blast మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి