Tension at Gannavaram: గన్నవరంలో టెన్షన్ వాతావరణం.. లోకేష్ పాదయాత్ర రూట్ మార్చిన పోలీసులు

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర గన్నవరంలో కొనసాగుతోంది. నారా లోకేష్ పాదయాత్ర రూట్ ను పోలీసులు మార్చడంతో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో హై టెన్షన్ నెలకొంది. ముందు రూట్ మ్యాప్ ప్రకారం ఎమ్మెల్యే వల్లభనేని ఆఫీసు ముందుగా లోకేష్ పాదయాత్ర వెళ్లాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే వంశీ.. ఆఫీసులోనే ఉండటంతో నారా లోకేష్ పాదయాత్ర అటువైపు వెళ్లకుండా పోలీసులు బార్కేడ్లు అడ్డుపెట్టారు.

New Update
Nara Lokesh Yuvagalam: యువగళం యాత్రపై నారా లోకేష్ సంచలన నిర్ణయం.. ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్

Gannavaram Police changed the route map of Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర గన్నవరంలో కొనసాగుతోంది. నారా లోకేష్ పాదయాత్ర రూట్ ను పోలీసులు మార్చడంతో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో హై టెన్షన్ నెలకొంది. ముందు రూట్ మ్యాప్ ప్రకారం ఎమ్మెల్యే వల్లభనేని ఆఫీసు ముందుగా లోకేష్ పాదయాత్ర వెళ్లాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే వంశీ.. ఆఫీసులోనే ఉండటంతో నారా లోకేష్ పాదయాత్ర అటువైపు వెళ్లకుండా పోలీసులు బార్కేడ్లు అడ్డుపెట్టారు.

తమ రూట్ మ్యాప్ ప్రకారం తాము వెళ్లాల్సిందేనంటూ తెలుగు దేశం పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం తలెత్తింది. వంశీ కార్యాలయంలో ఉన్న కారణంగా వేరే మార్గం గుండా వెళ్లాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం గన్నవరం సమీపంలోని హెచ్‌సీఎల్ వద్ద లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది.

ఐటీ మంత్రిగా రాష్ట్రానికి హెచ్‌సీఎల్ కంపెనీని తానే తెచ్చానంటూ లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. కాసేపట్లో పోలీసులు దిగ్బంధించిన మార్గం వద్దకు యువగళం పాదయాత్ర చేరుకోనుంది. లోకేష్ పాదయాత్ర కొనసాగే రహదారిపై పోలీసులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సైకో పోవాలి - సైకిల్ రావాలి అంటూ తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున డీజీ ప్లే చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల ఆంక్షలపై లోకేష్ ఎలాంటి స్టెప్ తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ntr District కారు భీభత్సం .. ఏడుగురు అడ్డాకూలీలు పైకి దూసుకెళ్లింది..

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కారు భీభత్సం సృష్టించింది. చెరువు బజారు కట్ట వద్ద ఏడుగురు కూలీలు అందరు నిలబడి ఉండగా.. వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
ntr district  Jaggayyapet  incident

ntr district Jaggayyapet incident

Ntr District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఏడుగురు అడ్డాకూలీలపైకి కారు దూసుకెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. అయితే మేస్త్రీ పని చేయడానికి వచ్చిన  అడ్డాకూలీలు ఉదయం బజారు చెరువు కట్ట సర్కిల్ వద్ద నిలబడి ఉండగా.. అతి వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిమిత్తం  క్షతగాత్రులను వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ప్రస్తుతం కారును సీజ్ చేయగా.. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎమ్మెల్యే పరామర్శ.. 

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే  శ్రీరాం రాజగోపాల్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు. సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపవలసిందిగా డాక్టర్ కు సూచించారు.  గాయపడిన వారిలో ఓర్సు రామకృష్ణ, బత్తుల వెంకట గురువులు తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు. 

telugu-news | latest-news | ntr-district

Advertisment
Advertisment
Advertisment