/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kadapa-bus-1.jpg)
Ganja Smuggled By Kadapa Private Bus : ఆహార పదార్థాల మాటున గంజాయి (Ganja) సరఫరాకు అడ్డాగా ప్రొద్దుటూరు (Proddutur) లోని ప్రయివేట్ ట్రావెల్స్ మారాయి. మైదుకూరు రోడ్డులోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో (Private Travels Bus) గంజాయి రవాణా చేసినట్లు పోలీసుల నిర్ధారణ చేశారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులతో పాటు పెద్ద ఎత్తున వస్తువుల రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రతిరోజు బస్సుల డిక్కీల్లో పెద్ద ఎత్తున విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి కడపకు వస్తువులు వస్తున్నాయి. పెద్ద ఎత్తున నిషేధిత వస్తువులను అక్రమార్కులు బస్సుల ద్వారా తరలిస్తున్నారు. అధికారులకు మామూళ్లు ఇస్తున్నామనే భావనతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు రెచ్చిపోతున్నారు.
Also Read : సోషల్ మీడియాలో వైసీపీ ఎమ్మెల్సీ న్యూడ్ వీడియో కాల్ హల్చల్