లోకేష్‌కు వినతిపత్రం సమర్పించిన గెయిల్ బాధితులు.!

పి.గన్నవరం నియోజకవర్గంలో లోకేష్ ను కలిసిన గెయిల్ బాధితులు వినతిపత్రం సమర్పించారు. ఓఎన్జీసీ - గెయిల్ పైపులైన్ల బ్లాస్టింగ్ జరిగి పదేళ్లు కావస్తున్నా బాధితులను ఆదుకోకపోవడం దురదృష్టకరమన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

New Update
లోకేష్‌కు వినతిపత్రం సమర్పించిన గెయిల్ బాధితులు.!

A Petition to Nara Lokesh: తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ను గెయిల్ బాధితులు కలిశారు. యువనేత నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. లేఖలో ఏం ప్రస్తావించారంటే..? "2014 జూన్ 27న మా గ్రామంలోని ఓఎన్జీసీ- గెయిల్ పైపులైన్ల బ్లాస్టింగ్ జరిగింది. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారు, అనేక మంది క్షతగాత్రులయ్యారు. నష్టపోయిన వారికి అప్పటి టీడీపీ ప్రభుత్వ చొరవతో ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు పరిహారం అందించింది. అయితే గెయిల్ యాజమాన్యం బాధితులు, గ్రామస్తులకు అప్పట్లో ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదు. పేలుడులో 80శాతం కాలిపోయిన వారికి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తామని చెప్పి చేయించలేదు. గ్రామాన్ని దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చి నేటికీ తీసుకోలేదు. పేలుడు ధాటికి బీటలు వారి ఇళ్ల స్థానంలో కొత్తవి కట్టిస్తామని చెప్పి నేటికీ నిర్మించలేదు.

Also Read: యువగళం పాదయాత్ర కాదు..బ్రేకుల యాత్ర..హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు.!

పేలుడులో ధ్వంసమైన దేవాలయ నిర్మాణానికి రూ.80లక్షలు అంచనా వేసి, రూ.30 లక్షలే ఇచ్చారు. గ్రామంలో ఫైర్ స్టేషన్ నిర్మిస్తామని చెప్పి, ఏర్పాటు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మించి నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి పట్టించుకోలేదు. పీ.హెచ్.సీ ని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామని చెప్పి చేయలేదు. బ్లాస్టింగ్ సమయంలో నష్టపోయిన రైతులకు సారం కోల్పోయిన పొలాల్లో మట్టి కూడా తోలలేదు. గ్రామస్తులకు ఉచిత గ్యాస్, కరెంటు ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వలేదు. ముస్లిం పంజాకు చెందిన 17.50 ఎకరాల్లో గెయిల్, ఓఎన్జీసీ ఆఫీసులు ఉన్నాయి, వాటికి పరిహారం చెల్లించడం లేదు. తొలగించిన పంజా స్థానంలో కొత్త పంజాను నిర్మించలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి" అని పేర్కొన్నారు.

దీనిపై నారా లోకేష్ స్పందిస్తూ..ప్రమాదం జరిగిన పదేళ్లు కావస్తున్నా ఓఎన్ జిసి – గెయిల్ అధికారులు ఇప్పటివరకు బాధితులను ఆదుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రాంత ప్రజలు వ్యక్తిగతంగా తమకు కష్ట నష్టాలు ఉన్నప్పటికీ దేశాభివృద్ధి దష్ట్యా ఓఎన్ జిసి- గెయిల్ సంస్థలకు తమవంతు సహకారం అందిస్తూ వస్తున్నారన్నారు. ప్రమాదం సంభవించినపుడు బాధితులను ఆదుకోవాల్సిన పూర్తి బాధ్యత చమురు సంస్థలదేనని స్పష్టం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పేలుడులో ధ్వంసమైన దేవాలయాలు, ముస్లిం పంజాల స్థానంలో కొత్తవి నిర్మిస్తామని భరోసా కల్పించారు. ఓఎన్జీసీ - గెయిల్ అధికారులతో మాట్లాడి బాధితులు, నగరం గ్రామస్తులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు