యువకుడి ప్రాణం తీసిన ప్రేయసి మెసేజ్.. ఏం పంపించిందంటే ప్రేయసి నిర్లక్ష్యం చేస్తుందని ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్నాను. ఛాటింగ్ చేయలేనని ఆమె ఎంత చెప్పిన వినకుండా విసిగించాడు. దీంతో 'మనలో ఎవరో ఒకరు చనిపోతే ప్రశాంతంగా ఉంటుంది'అని మెసేజ్ పంపింది. దీంతో వంశీ ఉరేసుకుని చనిపోయాడు. By srinivas 29 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి ఈ తరం యువకులు క్షణికావేశంలో ప్రాణాలు కొల్పోతున్న సంఘటనలు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ప్రేమ విషయంలోనే ఇలాంటి దారుణాలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఘోరాలకు మొబైల్ ఫోన్ కూడా ఒక ముఖ్య కారణమవుతోంది. ప్రియురాలు మెసేజ్ చేయట్లేదనే కోపంలో ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్నాను. ఛాటింగ్ చేయడం కుదరదు అని ప్రేయసి ఎంత చెప్పిన వినకుండా మొండిగా వాదించాడు. దీంతో చిరాకు వచ్చిన సదరు యువతి కోపంలో నోరుజారిన మాటను సీరియస్ గా తీసుకుని ఉరేసుకుని చనిపోయాడు. Also read :భర్త పర్సనల్ విషయాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు.. కర్ణాటక హైకోర్టు ఈ మేరకు పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ పరిధి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గాదె వంశీకృష్ణ (22) అనే యువకుడు డిగ్రీ చదివాడు. అయితే తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రి ఆ ఊరు వదిలి వలస వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే పెరిగాడు. ఇటీవల ఉద్యోగం కోసం కూడా ప్రయత్నాలు చేశాడు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్ ఆర్థిక సంస్థ సహకారంతో కారు కొన్నాడు. కానీ సరైన సమయంలో దాని బకాయిలు చెల్లించలేకపోయాడు. దీంతో సదరు సంస్థ నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే అతను ప్రేమించిన యువతి కూడా పెద్దగా పట్టించుకోలేదు. యువకుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అయితే సోమవారం రాత్రి ఫోన్ లో ఆమెతో ఛాటింగ్ చేశాడు. ఇట్లో ఉన్న యువతి ఇప్పుడు ఇక చేయలేనని, తర్వాత మాట్లాడతానని కోరింది. అయినా వినకుండా ఛాటింగ్ ఆపొద్దని కోరాడు. ఎంత చెప్పినా వినకుండా మొండిగా బిహేవ్ చేయడంతో సందరు యువతి కోపంలో..'మన ఇద్దరిలో ఎవరో ఒకరం చనిపోతే ప్రశాంతంగా ఉంటుంది' అని మెసేజ్ పెట్టింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వంశీ.. 'నీవెందుకు. నేనే చనిపోతా' అని రిప్లై ఇచ్చాడు. తదనంతరం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మేనమామ కిరణ్‌కుమార్ ఉదయాన్నే పోలీసులకు సమాచారం అందించగా.. ఎస్సై జి.సురేష్ వెళ్లి సంఘటన స్థాలానికి వెళ్లినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. #suicide #gade-vamsikrishna #girl-friend-message మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి