Gaddar Awards: గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. ఆ రోజే లోగో రిలీజ్!

గద్దర్ అవార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీకి ఛైర్మన్ గా బి.నర్సింగరావు, వైస్ ఛైర్మన్‌గా దిల్ రాజు నియమితులయ్యారు. కమిటీ సలహాదారులుగా అందెశ్రీ, కె.రాఘవేందర్ రావు, తమ్మారెడ్డి భరద్వాజ, బలగం వేణు, నారాయణమూర్తి తదితరులను నియమించారు.

New Update
Gaddar Awards: గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. ఆ రోజే లోగో రిలీజ్!

Gaddar Awards : గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేక కమిటీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ అవార్డులకు సంబంధించిన లోగో, విధి విధానాలు, నియమ నిబంధనలను కమిటీ సభ్యులు ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు గద్దర్ అవార్డుల కమిటీకి ఛైర్మన్ గా బి.నర్సింగరావు, వైస్ ఛైర్మన్‌గా దిల్ రాజు ఎన్నికయ్యారు. గద్దర్ అవార్డుల కమిటీ సలహాదారులుగా కె.రాఘవేందర్ రావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, గుమ్మడి వెన్నెల, తనికెళ్ల భరిణి, డి.సురేష్ బాబు, చంద్రబోస్, నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, బలగం వేణునును నియమించారు.

Also Read : అక్కినేని నాగార్జున N-కన్వెన్షన్ కూల్చివేత ఖాయం!?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Akhanda 2 పూనకాలు తెప్పిస్తున్న అఖండ 2 లేటెస్ట్ అప్డేట్

బాలయ్య 'అఖండ2' కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెల జార్జియా వెళ్తున్నట్లు సమాచారం. మే 2 నుంచి జార్జియా షెడ్యూల్ మొదలు కానుంది. దసరా కానుకగా మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

New Update

Akhanda 2 బాలయ్య  'అఖండ' భారీ విజయం తర్వాత అఖండ 2: తాండవం పై అంచనాలు పెరుగుతున్నాయి. బాలయ్య, బోయపాటి కాంబోలో రాబోతున్న నాల్గవ చిత్రమిది. ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తిచేసిన బోయపాటి.. ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ కోసం లొకేషన్ల వేటలో ఉన్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. 

జార్జియాలో లాంగ్ షెడ్యూల్ 

నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెల జార్జియా వెళ్తున్నట్లు సమాచారం. మే 2 నుంచి జార్జియా షెడ్యూల్ మొదలు కానుంది. బాలకృష్ణ,  ఇతర ప్రధాన నటులకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి  జార్జీయాలో అద్భుతమైన లొకేషన్స్ కోసం అన్వేషిస్తున్నారట డైరెక్టర్ బోయపాటి. 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత మరోసారి బాలయ్య సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. 

telugu-news | cinema-news | latest-news | Akhanda 2 Updates | Balakrishna Akhanda 2 Movie

Advertisment
Advertisment
Advertisment