JP Nadda: ఆడపిల్ల పుడితే రూ.2 లక్షలు, విద్యార్థినులకు ఉచిత స్కూటీ.. సంచలన హామీలు!

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జేపీ నడ్డా ‘సంకల్ప్‌ పాత్ర’ పేరుతో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. రాజస్థాన్ ప్రజలు బీజేపీ సర్కారును కోరుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే విద్యార్థినులకు ఉచిత స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చారు.

New Update
JP Nadda: సీఎం కేజ్రీవాల్, ఇండియా కూటమి భయపడింది.. జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు

Rajasthan Elections: రాజస్థాన్ రాష్ట్రంలో ఈ నెల 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ మాదిరే డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని (Congress Party) గద్దె దించేందుకు బీజేపీ (BJP) నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. రాజస్థాన్ ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక హామీలను బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. ఈరోజు రాజస్థాన్ లోని జైపూర్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (J. P. Nadda) పర్యటించారు. ఈ పర్యటనలో ‘సంకల్ప్‌ పాత్ర’ పేరిట రూపొందించిన పార్టీ మ్యానిఫెస్టోను ఆయన విడుదల చేశారు.

ALSO READ: నన్ను సీఎం అనకండి ప్లీజ్.. బండి సంజయ్ రిక్వెస్ట్!

ప్రచారంలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. రాజస్థాన్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడిపోవాలని.. వారు డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాజస్థాన్ లో అవినీతి,పేపర్ లీకులు పెరిగిపోయాయని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన పేపర్ లీకులు, అవినీతిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటేనే ప్రతి జిల్లాకో మహిళా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రముఖ పట్టణాల్లో ‘యాంటీ రోమియో స్క్వాడ్‌’లు నియమిస్తామని పేర్కొన్నారు. కుటుంబంలో ఆడపిల్ల జన్మిస్తే రూ.2 లక్షలు ఇస్తామని తెలిపారు. గ్యాస్‌ సిలిండర్‌పై రూ.450 చొప్పున రాయితీ, వచ్చే ఐదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 15 వేల వైద్యుల నియామకం, ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ కింద రైతులకు ఏటా అందించే ఆర్థిక సాయం రూ.12 వేలకు పెంపు, 12వ తరగతి పాసైన ప్రతిభ గల విద్యార్థినులకు ఉచిత స్కూటీ, క్వింటాలుకు రూ.2700 చొప్పున గోధుమల కొనుగోలు.. వంటి పథకాలు మేనిఫెస్టోలో బీజేపీ పొందుపరిచింది.

ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే రాజస్థాన్ రాష్ట్ర ప్రజల సంప్రదాయాన్ని కాంగ్రెస్ ఈసారి కూడా అధికారంలోకి వచ్చి మార్చాలని ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ఈసారి రాజస్థాన్ లో కాషాయ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకొని కార్యాచరణ చేస్తోంది.

ALSO READ: సీఎం కేసీఆర్ చరిత్ర సరిగ్గా చదవలేదు.. చిదంబరం కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు