TS NEWS: నిరుద్యోగులకు ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్.. అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు..!!

నిరుద్యోగులకు కోచింగ్ కోసం నియోజకవర్గ కేంద్రాల్లో నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. త్వరలోనే టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెంట్ ప్రకటించనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు కోచింగ్ బారం పడకుండా ఈ కేంద్రాలను ప్రారంభించినున్నట్లు ఆయన తెలిపారు.

New Update
TS NEWS: నిరుద్యోగులకు ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్.. అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు..!!

TS NEWS: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..ఒక్కొక్క హామీని నెరవేర్చుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు కూడా ఉద్యోగ నోటిఫికేషన్లో రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 2,3 నోటిఫికేషన్లను రిలీజ్ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్..త్వరలోనే టెట్, మెగాడీఎస్సీ కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది.

కాగా గ్రూప్ 2 పోస్టుల దరఖాస్తులకు శుక్రవారం నుంచి దరఖాస్తులు కూడా మొదలు కానున్నాయి. ఈ తరుణంలో పేద, మధ్య తరగతి నిరుద్యోగులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది సర్కార్. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ ..కోచింగ్ తీసుకునేంత డబ్బులేని పేద విద్యార్థుల కోసం స్పెషల్ గా ఆన్ లైన్ కోచింగ్ ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది.

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు కోచింగ్ కోసం నియోజకవర్గ కేంద్రాల్లో నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్ల భట్టివిక్రమార్క తెలిపారు. త్వరలోనే టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెంట్ ప్రకటించనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు కోచింగ్ బారం పడకుండా ఈ కేంద్రాలను ప్రారంభించినున్నట్లు ఆయన తెలిపారు. నిరుద్యోగులకు ఆన్ లైన్ ద్వారా కోచింగ్ ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని విద్యాశాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

ఇది కూడా చదవండి: మరో 100 రెసిడెన్షియల్ స్కూల్స్.. విద్యార్థులకు డిప్యూటీ సిఎం భట్టి గుడ్ న్యూస్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు