AP Politics: చంద్రబాబు మన భారత జాతి సంపద: నన్నపనేని రాజకుమారి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయిడు మన జాతి సంపద అని నన్నపనేని రాజకుమారి అన్నారు. ఆయనను జైలులో నిర్భందించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. By Vijaya Nimma 27 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి సీఎం జగన్ నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు చేసిన అవినీతి గుర్తుకు రాలేదా? అని టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి ప్రశ్నించారు. ఈ రోజు రాజకుమారి మీడియాతో మాట్లాడుతూ.. మచ్చలేని చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు మాసాలుగా ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. తెలుగు వారు వారి గళాన్ని వినిపిస్తున్నారని ఆమె తెలిపారు. తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడం కోసం కట్టుబట్టలతో హైదరాబాద్ వదిలి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిందని గుర్తు చేశారు. అరాచక దౌర్జన్య పాలనను తెలియజేస్తూ.. చంద్రబాబు అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసుకుని, ప్రజా మన్ననలు పొందారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, నిర్మాణానికి కారకులైన చంద్రబాబు జైల్లో అనారోగ్య స్థితిలో ఉన్నారన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్న వైసీపీ ప్రభుత్వం తనపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిందన్నారు. హౌస్ అరెస్టులు కూడా చేశారని ఆమె ఆరోపించారు. ఏపీ ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారు ప్రజాధనంతో ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రజా వేదికను వైసీపీ వాడుకోకుండా కూల్చివేయడంపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏపీ ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారని ఆమె మండిపడ్డారు. వైసీపీ దాడులకు ప్రజలు భయపడి మౌనం వహిస్తున్నారన్నారన్నారు. నారా భువనేశ్వరి సభలకు మహిళలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇది కూడా చదవండి: బైక్‌పై వెళ్తున్న తల్లీకుమారులను వెంబడించి.. వేట కొడవళ్లతో దాడి #tirupathi #ap-politics #former-tdp-minister-nannapaneni-rajkumari #nannappaneni-media-conference మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి