AP Politics: ఏపీలో రైతుల పరిస్థితి చాలా బాధాకరం: మాజీ మంత్రి అఖిలప్రియ

ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫైర్‌ అయ్యారు. గురువారం మీడియా సమావేశం నిర్వహించి జగన్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.

New Update
AP Politics: ఏపీలో రైతుల పరిస్థితి చాలా బాధాకరం: మాజీ మంత్రి అఖిలప్రియ

కర్నూలులో ఈ రోజు మాజీ మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే రైతు రాజు అవుతారన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైతులను గాలికి వదిలేశారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. సీఎం జగన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాయలసీమలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీమ నాయకులు పట్టించుకోవడం లేదని భూమా అఖిలప్రియ ఆరోపించారు.

సాగునీటి సలహాదారులుగా గంగుల ప్రభాకర్‌రెడ్డి ఉన్నా.. ప్రయోజనం శూన్యమని ఆమె విమర్శలు చేశారు. సాగునీటి సమస్యకు పరిష్కారం చూపని పదవులు అవసరమా..? అని భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. 5 రోజుల్లో కేసీ కెనాల్ రైతులకు నీరు అందిచని పక్షంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, సాగునీటి సలహాదారుడు గంగుల ప్రభాకర్‌రెడ్డి తమ చేతకాదని ఒప్పుకోవాలని భూమా అఖిలప్రియ సవాల్‌ చేశారు. కేసీకి నీళ్ళు వచ్చేదాకా రైతుల కోసం పోరాటం చేస్తానని ఆమె తెలిపారు.

ముత్తలూరులో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించిన అఖిల ప్రియ.. ఇంటింటికి తిరిగి ‘బాబుతో నేను’ కరపత్రాలు పంపిణీ చేశారు అఖిలప్రియ. ఈసందర్భంగా.. వైసీపీ నాయకులు కక్ష సాధింపులు, కమిషన్‌ రాజకీయాలు, ఇసుక దందా వంటివి చేపడుతున్నారని ఆమె ఆరోపించారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపడం జగన్‌ పాలనలో ఒక భాగం అని విమర్శించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆమె ఫైర్‌ అయ్యారు. అన్ని కేసుల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని మాజీ మంత్రి ధీమా వ్యక్తం చేశారు. నారా భువనేశ్వరి చేపట్టిన న్యాయం గెలవాలి కార్యక్రమం విజయవంతం అవుతుందని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఈ సందర్భంగా అఖిలప్రియ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు