AP News: నల్లమలలో వీడిన చిరుత భయం.. జూపార్క్‌కు మరో చిరుత

నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం గోశాల సమీపంలో మరో చిరుత ప్రత్యక్షమైయింది. గత మూడు రోజులుగా గోశాల సమీపంలో ఈ చిరుత సంచరిస్తున్నట్ల ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. చిరుత పులిని పట్టుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించి తిరుపతి జూపార్క్‌కు తరలించారు.

New Update
AP News: నల్లమలలో వీడిన చిరుత భయం.. జూపార్క్‌కు మరో చిరుత

AP News: ఉమ్మడి కర్నూలుల జిల్లాలో చిరుతలు కలవర పెటుడున్న విషయం తెలిసిందే. గిద్దలూరు ఘాట్ రోడ్డులో సంచరిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు బోనులో బంధించారు అటవీ అధికారులు. ఈ చిరుత ఇటీవల మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నీసా అనే మహిళను చంపేసి రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేసింది.

తిరుపతి జూపార్క్‌కు మరో చిరుత:

తాజాగా మరో చిరుత నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం గోశాల సమీపంలో ప్రత్యక్షమైయింది. గత మూడు రోజులుగా గోశాల సమీపంలో ఈ చిరుత సంచరిస్తున్నట్ల ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. చిరుతపులి దృశ్యాలు చూసిన ఆలయ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. చిరుత పులి సంచారంతో భక్తులు, స్థానికులు భయాందోళనలకు గురైయ్యారు. చిరుత సంచారంపై వెంటనే నంద్యాల జిల్లా ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌కు ఆలయ అధికారులు సమాచారం అందించారు. పచ్చర్ల వద్ద నల్లమలలో చిరుత కోసం బోను, 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే అటుగా సంచరించే చిరుత పులిని పట్టుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించి తిరుపతి జూపార్క్‌కు తరలించారు.

ఇది కూడా చదవండి:  షాద్‌నగర్ పేలుడు ఘటనలో ట్విస్ట్..లభించని ముగ్గురి ఆచూకీ

Advertisment
Advertisment
తాజా కథనాలు