Hyderabad: ఈ హోటళ్లలో ఫుడ్ తింటున్నారా.. ఇక అంతే సంగతులు!

హైదరాబాద్‌ రెస్టారెంట్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. చాలా హోటల్స్‌లో గడువు ముగిసిన పదార్థాలను గుర్తించారు. నగరంలో ఫేమస్ అయిన పలు రెస్టారెంట్లలో హోటల్ సిబ్బంది సేఫ్టీ రూల్స్ పాటించనట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి..

New Update
Hyderabad: ఈ హోటళ్లలో ఫుడ్ తింటున్నారా.. ఇక అంతే సంగతులు!

Hyderabad Restaurants: హైదరాబాద్‌ రెస్టారెంట్లలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. చాలా హోటల్స్‌లో నాన్‌ వెజ్‌, వెజ్‌ ఫుడ్స్‌ ఒకే చోట స్టోరేజ్ చేస్తున్నారు. అంతేకాకుండా హోటల్స్‌లో గడువు ముగిసిన పదార్థాలు గుర్తించారు అధికారులు. సరిగ్గా సీల్ చేయని ఆహార పదార్థాలు సీజ్‌ చేశారు. గడువు ముగిసిన పాల ప్యాకెట్లు, లేబుల్‌ లేని అల్లం పేస్టు లను గుర్తించారు. హోటల్ సిబ్బంది సేఫ్టీ రూల్స్ పాటించనట్లు తెలుస్తోంది.

Also Read: తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయిన బాలిక.. చివరికి దారుణం..!

ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లను ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు విడుదల చేశాయి. క్రీమ్ స్టోన్, న్యాచురల్ ఐస్‌క్రీమ్, KFC, రోస్టరీ కాఫీ హౌస్, రాయలసీమ రుచులు, షాగౌస్, కామత్ హోటల్, 36 డౌన్ టౌన్ బ్రూ పబ్,  మాకౌ కిచెన్ అండ్ బార్, ఎయిర్ లైవ్, టాకో బెల్, అహా దక్షిణ్, సిజ్లింగ్‌ జో, ఖాన్ సాబ్, హోటల్ సుఖ్‌ సాగర్, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ స్టోర్, కృతుంగ, రెస్ట్ ఓ బార్‌లో సేఫ్టీ రూల్స్ పాటించలేదని సంచలన విషయాలు వెల్లడించారు.

Advertisment