Andhra Pradesh: 10 రోజుల్లో సమస్యల పరిష్కరిస్తాం–సీఎం చంద్రబాబు

వరద ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపటి నుంచి కూరగాయలు సబ్సిడీతో ఇస్తున్నాం. రూ.2, రూ.5, రూ.10, మూడు రేట్లు మాత్రమే ఉంటాయి. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని తెలిపారు.

New Update
Andhra Pradesh: 10 రోజుల్లో సమస్యల పరిష్కరిస్తాం–సీఎం చంద్రబాబు

AP CM Chandra babu: బ్యాంకర్లు.. ఇన్స్యూరెన్స్ తో సమావేశం జరిగిందని.. ఇందులో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు సీఎ చంద్రబాబు. చిన్న వ్యాపారాలు చేసుకొనేవారికి... వాహనాలకు జరిగిన నష్టం దృష్టిలో పెట్టుకొని 10 రోజుల కాల పరిమితి పెట్టుకొని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనే వారు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అని చెప్పారు. గృహాలలో ఉన్న పరికరాలకు.. వస్తువులు నష్టపోయినవారిని ఆదుకునేందుకు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిసి వరద బాధితులకు ఆదుకునేందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

వరద బాధితులకు ఆహార పంపిణీ విషయంలో మెరుగైన సేవలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇలాంటి కష్ట సమయంలో పనిచేస్తున్న ప్రతి అధికారులకు అభినందనలు చెప్పారు ఏపీ సీఎం. ప్రజలు కూడా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మాకు సహకారం అందిస్తున్నారు. రేపటి నుండి ప్రజలకు అవసరం అయిన 5 రకాల నిత్యావసర సరుకులు అందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. త్వరలో పాలు కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు వస్తున్న నివేదికల ఆధారంగా బాధితులకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. విజయవాడ లో జరిగిన మీడియా సమావేశంలో మొత్తం వివరాలను చెప్పారు.

వరద ప్రాంతాల్లో ఫైర్ సిబ్బంది సేవలు భేష్ గా ఉన్నాయి.. ఒక్కో ఫైర్ ఇంజన్ క్రింద 250ఇల్లు శుభ్రం చేస్తున్నాయని చెప్పారు సీఎం చంద్రబాబు. మంచినీటికి ఇబ్బంది లేకుండా ట్యాంకర్లను పెంచుతాం. సమాచార వ్యవస్థను.. విద్యుత్ సరఫరాను పునరుద్ధిస్తున్నాం. రేపు పెద్ద ఎత్తున నగరాన్ని శుభ్ర పరిచేందుకు ఏర్పాట్లు చేశామని..బుడమేరుకు పడిన గండ్లు పూడ్చే పని దాదాపు పూర్తి అవుతుందని తెలిపారు. 99 లక్షలకు పైగా ప్రభుత్వ ఇచ్చిన QR కోడ్ ద్వారా విరాళాలు వచ్చాయి.. విరాళాలు ఇచ్చిన వారిని అందరినీ అభినందిస్తున్నానన్నారు బాబు. గత 5రోజులుగా అలు పెరగకుండా రాష్ట్ర మంత్రులు, అధికార యంత్రాంగం చాలా బాగా పనిచేస్తున్నారు.

Also Read: Haryana: బీజేపీ తొలి జాబితా విడుదల..సీఎం సైనీ పోటీ ఎక్కడ నుంచి అంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు