Lipstick Tips: పెదాలకు లిప్‌స్టిక్‌ ఎక్కువ సేపు ఉండాలంటే..ఈ టిప్ చూడండి

చాలామంది అమ్మాయిలు పెదాలకు రంగుల లిప్‌స్టిక్‌లు వేసుకుంటారు. ట్రెండ్‌లో ఉన్న లిప్‌స్టిక్‌ రంగును ఎక్కువ ఎంచుకుంటారు. వీటిని పెదవులపై పెట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు. లిప్‌స్టిక్ చెరిగిపోకుండా ఎక్కువ సమయం ఉండాలంటే పెదవులపై ట్రాన్స్‌కులేట్ పౌడర్‌ను రాసుకోవచ్చు.

New Update
Lipstick Tips: పెదాలకు లిప్‌స్టిక్‌ ఎక్కువ సేపు ఉండాలంటే..ఈ టిప్ చూడండి

Lipstick Tips: అందంగా కనిపించేందుకు అమ్మాయిలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల మేకప్‌లు వాడుతుంటారు. పెదాలు అందంగా కనిపించేందుకు అనేక రకాల లిప్‌స్టిక్‌ను వాడుతుంటారు. ఎంతగా రెడీ అయినా పెదాలకు లిప్‌స్టిక్ లేనిదే అందం రాదు. ఒకప్పుడు సెలబ్రిటీలు, మోడల్స్ మాత్రమే ఈ లిప్‌స్టిక్‌ను వాడేవారు. ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్క ఆడవాళ్లు లిస్ట్ వేసుకుంటున్నారు. లిప్‌స్టిక్‌ సరైన న్యూడ్ షేడ్స్‌ని ఎంచుకుంచేనే బాగుంటుంది. లిప్‌స్టిక్‌ను పెదవులపై అప్తే చేయడానికి చాలా సమయం పడుతుంది. అయితే.. ఏదైనా తినేప్పుడు లేదా తాగినప్పుడు ఈ లిప్‌స్టిక్ అనేది తొలగిపోతూ ఉంటుంది. దాంతో మళ్లీ వేసుకోవాల్సి వస్తుంది. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల లిప్‌స్టిక్ చెరిగిపోకుండా ఎక్కువ సమయం ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పెదవులపై ట్రాన్స్‌కులేట్ పౌడర్‌ను రాసుకోవచ్చు

లిప్‌స్టిక్ వేసుకోవడం అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ లిప్‌స్టిక్స్ వేసుకుంటున్నారు. దీనిని వాడే ముందు కొన్ని టిప్స్ పాటించకపోతే మీ లుక్ మంచిగా వస్తుంది. ఎక్కువసేపు మీ పెదాలకు లిప్‌స్టిక్ ఉండాలంటే లిఫ్ట్ ప్రైమర్‌ను ముందుగా వేసుకోవాలి. ఇది మనం వేసుకునే లిప్‌స్టిక్ మంచి గ్రిప్ అందిస్తుంది. అంతేకాకుండా లిప్‌స్టిక్ చెదిరిపోకుండా ఉండడానికి స్మడ్జ్ ప్రూఫ్‌గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. మన చర్మ ఆకృతిని కూడా సున్నితంగా మారుస్తుంది. ఒకవేళ లిప్ ప్రైమరీ లేనిపక్షంలో పెదవులపై ట్రాన్స్‌కులేట్ పౌడర్‌ను రాసుకోవచ్చు. లిప్‌స్టిక్‌ను పెట్టుకున్న తర్వాత.. ఆ పొడిని పెదాలపై రాసుకుంటే అది లిప్‌స్టిక్‌ను డల్‌గా కాకుండా చూస్తుంది. ఈ చిట్కాను పాటిస్తే కొన్ని గంటలపాటు మీ పెదాలకు లిప్‌స్టిక్ అలాగే ఉండిపోతుంది.

ఇది కూడా చదవండి: రోజూ మేకప్ వేసుకుంటున్నారా జాగ్రత్త..ఈ సమస్యలు తప్పవు

ఆడవారు వారి పెదాలను ఆకర్షణీయంగా మార్చుకునేందుకు లిప్‌స్టిక్ ఎక్కువగా వాడుతుంటారు. నాసిరకం లిప్‌స్టిక్‌లు వాడితే చాలా అనర్ధాలు వస్తాయి. లిప్‌స్టిక్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ కాలం మన్నిక ఉండేది తీసుకుంటే మంచిది. లిప్‌స్టిక్‌ను రాసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్‌లో తీసుకొని పెదాలపై ఉంచాలి. దానిపై ట్రాన్స్‌లూసెంట్ పౌడర్‌ను వేయాలి. బ్రష్‌ను వాడుకొని లిప్‌స్టిక్ డబుల్ కోటింగ్ వేయాలి. ఇలా చేస్తే ఎక్కువ సేపు లిప్‌స్టిక్ పోకుండా ఉంటుంది. అయితే.. షైనింగ్ కోసం వాటిలో కెమికల్స్, లెడ్ ఉపయోగిస్తారు. వీటిని వాడితే స్త్రీలలో నాడీ వ్యవస్థలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడి, హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. పెదవులు అందంగా కనిపించడానికి ఈ ట్రిప్స్‌ను ఫాలో అయితే అందంగా కనిపిస్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు