ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్ స్కూల్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. ప్రస్తుతం పవన్ కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందనే విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్, లోకేష్ తదితరులు స్పందించారు.
ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?
మెగాస్టార్ స్పందిస్తూ..
పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 8 ఏళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని తెలిపారు. కాకపోతే స్వల్పంగా కాళ్లకు గాయాలయ్యాయని వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై స్పందించారు. మార్క్ శంకర్‌కు గాయాలైన ఘటన ఆందోళన కలిగించిందని అన్నారు. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యానని కేటీఆర్ ట్వీట్ చేశారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయినట్లు లోకేష్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ అన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలయ్యాయి. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు లోకేష్ ట్వీట్ చేశారు.