Flipkart Dussehra Discounts: దుమ్ములేపుతున్న దసరా ఆఫర్లు.. రెడ్ మీ నుంచి ఐఫోన్ వరకు.. అదిరే డిస్కౌంట్లు ఇవే!

తాజాగా దసరా పండుగ నేపథ్యంలో బిగ్‌ దసరా సేల్‌ పేరుతో మరోసారి సేల్‌ నిర్వహిస్తుంది ఫ్లిప్‌ కార్ట్‌ .ఈ నెల 22 నుంచి 29 వరకూ అంటే ఎనిమిది రోజుల పాటు దసరా సేల్స్‌ జరుగనున్నాయి.ఫ్లిప్‌ కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఈ ఆఫర్‌ ఒక రోజు ముందుగానే దసరా సేల్‌ అందుబాటులోకి వచ్చింది

New Update
Flipkart Dussehra Discounts: దుమ్ములేపుతున్న దసరా ఆఫర్లు.. రెడ్ మీ నుంచి ఐఫోన్ వరకు.. అదిరే డిస్కౌంట్లు ఇవే!

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అయిన ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ పేరిట తన వినియోగదారులకు మంచి ఆఫర్లు ఇచ్చింది. తాజాగా దసరా పండుగ నేపథ్యంలో బిగ్‌ దసరా సేల్‌ పేరుతో మరోసారి సేల్‌ నిర్వహిస్తుంది. ఈ నెల 22 నుంచి 29 వరకూ అంటే ఎనిమిది రోజుల పాటు దసరా సేల్స్‌ జరుగనున్నాయి.

ఫ్లిప్‌ కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఈ ఆఫర్‌ ఒక రోజు ముందుగానే దసరా సేల్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలోనే కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఆర్బీఎల్‌, ఎస్బీఐ, కార్డు హోల్డర్ల పై పది శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నది. వీటితో పాటు సూపర్ కాయిన్లు ఉపయోగించి కూడా ఐదు శాతం డిస్కౌంట్‌ అందుకోవచ్చని ఫ్లిప్‌ కార్ట్‌ వెల్లడించింది.

స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు, ఎలక్ట్రానిక్‌ ప్రొడక్ట్‌ లు, హోం అప్లియెన్సెస్‌, దుస్తులు పై ఆఫర్లు అందిస్తున్నట్లు ఫ్లిప్‌ కార్ట్‌ ప్రకటించింది. మోటరోలా ఎడ్జ్‌ 40, ఒప్పో రెనో 10 5 జీ, గూగుల్‌ పిక్సెల్ 7 ఏ, సామ్‌సంగ్‌ ఎస్‌ 22 5 జీ , ఒప్పో ఎఫ్‌ 5 వివో టీ 2 ప్రో తదితర మొబైల్‌ ఫోన్ల పై ఆఫర్లు అందజేయనున్నట్లు తెలిపింది.

ఐ ఫోన్‌ 14 తో పాటు పలు స్మార్ట్‌ ఫోన్ల పై త్వరలో ఆఫర్ల గురించి తెలియజేయనుంది. బిగ్‌ బిలియన్‌ డేస్‌ లో ఈ ఆఫర్లను మిస్‌ అయితే కనుక దసరా ఆఫర్స్‌ లో వీటిని పొందవచ్చు. మోటరోలా ఎడ్జ్‌ 40 ఫోన్‌ రూ. 34,999 నుంచి రూ. 26, 999 లకు తగ్గిస్తున్నట్లు. రియల్‌ మీ 11 ప్రొ+ 5 జీ ఫోన్‌ ను ఈ ఆఫర్స్ లో రూ. 32, 999 నుంచి రూ. 29,999 లకే పొందవచ్చు.

ఒప్పోరెనో 10 5 జీ ఫోన్‌ రూ. 38,999 నుంచి రూ. 32,999 లకే అందుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్‌ రూ. 43,999 నుంచి రూ. 35,999 లకే లభిస్తున్నట్లు ఫ్లిప్‌ కార్ట్‌ తెలిపింది. సామ్‌ సంగ్‌ గెలాక్సీ ఎస్‌ 22 ఫోన్‌ రూ. 85,999 లది రూ. 39,999 కే లభిస్తుంది. పొకో ఎఫ్5జీ ఫోన్‌ రూ. 34,999 నుంచి రూ. 23,999 లకు తగ్గించినట్లు తెలుస్తుంది.

వివో టీ 2 ప్రో 5 జీ ఫోన్ రూ. 3000 వరకు డిస్కౌంట్‌ తో రూ. 24, 999 లకే లభిస్తుంది. నథింగ్‌ ఫోన్‌ 2 ఫోన్‌ రూ. 59,999 నుంచి రూ. 49,999 లకు తగ్గింపు ధరలో లభిస్తుంది. మోటో జీ54 ఫోన్ రూ.17,999 నుంచి రూ.13,999లకు లభిస్తుంది. ఐ ఫోన్ 12 ఫోన్‌ రూ. 49,900 నుంచి రూ. 42,999 లకు తగ్గింపు ధరలతో లభిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ డిస్కౌంట్‌ తో రూ. 39,999 లకే పొందవచ్చు. ఐ ఫోన్‌ 13 మోడల్‌ రూ. 59,900 నుంచి రూ. 51,999 లకే లభిస్తుంది. ఫ్లిప్‌ కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ తో రూ. 49, 399 లకే లభిస్తుంది. ఐ ఫోన్‌ 14 ఫోన్‌ రూ. 69,900 నుంచి రూ. 61, 999 లకే తగ్గింపు ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ తో రూ.53,998లకు లభ్యం. ఐఫోన్ 15 (128 జీబీ) ఫోన్ ఐసీఐసీఐ బ్యాంక్ డిస్కౌంట్ తో రూ.78,150లకు లభ్యం

Advertisment
Advertisment
తాజా కథనాలు