Flight: విమానంలో ప్రయాణికుడు ఆత్మహత్యయత్నం..ఎమర్జెన్సీ ల్యాండింగ్! థాయ్ ల్యాండ్ కు చెందిన ‘ఇవా ఎయిర్‌లైన్స్’ ఫ్లైట్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. By Bhavana 19 Mar 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి థాయ్‌లాండ్ నుండి UKకి వెళ్లే విమానాన్ని ఒక ప్రయాణికుడు విమానం బాత్రూంలో ఆత్మహత్యకు ప్రయత్నించడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. బ్యాంకాక్ నుండి EVA ఎయిర్ ఫ్లైట్ BR67 శుక్రవారం లండన్ హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లోకి దిగే క్రమంలో ఓ ప్రయాణికుడు బాత్రూం నుంచి ఎంతసేపటికీ బయటకు రాకపోవడాన్ని క్యాబిన్ సిబ్బంది గమనించారు. దీంతో వారు బాత్రూం తలుపులు ఎంత కొట్టినప్పటికీ అతను తలుపు తీయకపోవడంతో సిబ్బందికి ఏదో అనుమానంగా అనిపించింది. వెంటనే తలుపులు తెరిచి చూడగా అతను ఆత్మహత్యకు పాల్పడుతూ కనిపించాడు.వెంటనే అతడిని బయటకు తీసుకుని వచ్చి విమాన సిబ్బందితో పాటు విమానంలో ఉన్న ఓ డాక్టర్ ఆ వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు. ఈ క్రమంలో విమానం హిత్రూ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ప్రయాణికుడిని తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.అయితే దీని గురించి ఎయిర్ లైన్ సిబ్బంది ధృవీకరించింది కానీ ప్రయాణికుడి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది. Also read: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మూడురోజుల్లో భారీ వర్షాలు! #flight #sucide #airlines #eva మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి